TS EdCET 2023: తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. మే 18న పరీక్ష
Telangana EDCET Schedule 2023: తెలంగాణ ఎడ్ సెట్ 2023 నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీతో పాటు పలు వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
Telangana EdCET 2023 Updates: తెలంగాణలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఎడ్ సెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రితో కలిసి టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 18వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు.

షెడ్యూల్ వివరాలు:
మార్చి 4 - ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.
మార్చి 6 - అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 500, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 700 చెల్లించాలి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
మార్చి 30- అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మే 5 - ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
మే 18 - ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది.
మే 21 - ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
NOTE: తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, కీ, ఫలితాలను https://edcet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.
ఇక ఇదే వారంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 షెడ్యూల్ కూడా విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ వివరాలు:
తెలంగాణ ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం
మే 6వ తేదీలో దరఖాస్తుల గడువు ముగుస్తుంది.
రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు ఎడిట్ అవకాశం ఉంటుంది.
మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
జూన్ 5న ప్రాథమిక కీ విడుదల అవుతుంది.
ఆన్సర్ కీపై జూన్ 8న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను పంపవచ్చు.
జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల అవుతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, ఆన్‌లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల, హాల్ టికెట్లు, ఫలితాలు విడుదలతో పాటు ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tsicet.nic.in/ ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం