BRAOU : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలు... నోటిఫికేషన్ విడుదల-braou b ed entrance test details announced check main dates of exam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Braou B.ed Entrance Test Details Announced Check Main Dates Of Exam

BRAOU : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలు... నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 07:28 PM IST

BR Ambedkar Open University: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్శిటీ బీఎడ్, బి.ఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష (2022-23) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు వివరాలను పేర్కొంది.

 అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రవేశాలు
అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రవేశాలు

BR Ambedkar Open University Bed Admissions: దూర విద్యలో బీఈడీ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. 2022- 23 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ప్రవేశాలుగా పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

వర్శిటీ - అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్

ప్రవేశాలు - బీఈడీ, బి.ఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)

దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం

దరఖాస్తులకు చివరి తేదీ - మే 22, 2023

దరఖాస్తు రుసుం - జనరల్ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి.

హాల్ టికెట్లు పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు అందుబాటులో ఉంచుతారు.

అర్హత పరీక్ష - జూన్ 6వ తేదీ, 2023 (B.Ed – ODL 10:30 AM to 12:30 PM) B.Ed (Special Education - 2.00 PM to 4.00 PM.)

అధికారిక వెబ్‌సైట్‌ - https://braouonline.in/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పీహెచ్డీ ప్రవేశాలు…

మరోవైపు పీహెచ్డీ కోర్సుల్లోనూ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది అంబేడ్కర్ వర్శిటీ. అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో కోరింది. 2022- 23 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ప్రవేశాలుగా పేర్కొంది.

ప్రవేశాలు - పీహెచ్డీ

వర్శిటీ - అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్

అందుబాటులో ఉన్న కోర్సులు - ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ సైన్స్‌‌.

అర్హత పరీక్ష - మే 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.

అర్హతలు - పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది.(నెట్/సెట్ వంటివి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది)

ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.

అర్హత పరీక్ష తర్వాత ఇంటర్వూ కూడా ఉంటుంది.

పీహెచ్డీ అర్హత పరీక్ష సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్, ఫీజు - ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.1,000, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

చివరి తేదీ - చెల్లింపునకు మే 8న చివరి తేదీ

ఫైన్ తో చివరి తేదీ - మే 12వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. (రూ. 500)

ఎగ్జామ్ కేంద్రాలు - కేవలం హైదరాబాద్ లోనే ఉంటుంది.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అధికారిక వెబ్ సైట్ - www.braouonline.in 

వివరాలు కోసం సంప్రదించాల్సిన నెంబర్ - 1800 599 0101(Controller of Examinations 040-23541376, 23680240)

IPL_Entry_Point