తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Latest Tirumala Tour Package From Karimnagar City

IRCTC Tour Package: కరీంనగర్ నుంచి తిరుమల టూర్.. 5 వేల ధరలో 4 రోజుల ట్రిప్, డిటేయిల్స్ ఇవిగో

HT Telugu Desk HT Telugu

05 May 2023, 17:48 IST

    • IRCTC Tour Package From Karimnagar: కరీంనగర్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ‘సప్తగిరి’ పేరుతో ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను పేర్కొంది….
తిరుమల
తిరుమల (facebook)

తిరుమల

IRCTC Tourism Tirumala Tour Package: వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో సేద తీరే ప్రదేశాలతో పాటు అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉంటున్నాయి. ఇందులో భాగంగా… కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAPTHAGIRI' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ మే18వ తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Day 01: కరీంనగర్ నుంచి (Train No. 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.

Day 02: ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెష్ అప్ అవుతారు. అక్కడ్నుంచి శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు వెళ్తారు. తిరిగి హోటల్ కు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 03: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత..హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఉదయం 08.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.

Day 04: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు:

ఈ సప్తగిరి ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 9010 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 7640 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.7560గా ఉంది. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి.