తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Latest Alleppey And Munnar Tour Package Check Complete Details Are Here

IRCTC Hyd Kerala Tour : కేరళ ట్రిప్... 12 వేల ధరలో 6 రోజుల టూర్, ఈ కొత్త ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu

23 April 2023, 16:06 IST

    • IRCTC Latest Kerala Tour Package: సమ్మర్ వచ్చేసింది..! కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకోసం కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ధరలతో పాటు తేదీల వివరాలను పేర్కొంది.
కేరళ టూరిజం
కేరళ టూరిజం (facebook)

కేరళ టూరిజం

IRCTC Hyderabad - Kerala Tour Updates: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. కేరళ ట్రిప్ ప్లాన్ చేసే వారికోసం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మే 2, 2023 తేదీన అందుబాటులో ఉంది.ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

Day 01: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02: రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.

Day 03 : ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 : హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

Day 05 : హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 06 : మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

కేరళ టూర్ ధరలు...

ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 32230 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18740 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15130 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

కేరళ టూర్ ధరలు

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు