తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Himachal Tour : హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హిమాచల్ టూర్.. ఈ 7 రోజుల ప్యాకేజీ చూడండి

IRCTC Himachal Tour : హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో హిమాచల్ టూర్.. ఈ 7 రోజుల ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu

16 April 2023, 13:54 IST

    • IRCTC Himachal Tour From Hyderabad: మండే వేసవిలో హిమాచల్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. డేట్స్ తో పాటు ధరల వివరాలను పేర్కొంది.
హైదరాబాద్ - హిమాచల్ టూర్
హైదరాబాద్ - హిమాచల్ టూర్ (facebook)

హైదరాబాద్ - హిమాచల్ టూర్

IRCTC Tourism Himachal Tour Package: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. HAPPY HIMACHAL పేరుతో హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో భాగంగా ఛండీఘర్, మనాలి. సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు మరిన్ని కవర్ అవుతాయి. ఇది 7 రోజులు, 6 రాత్రుల ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 18వ తేదీన అందుబాటులో ఉంది.

Day 01: Hyderabad to Chandigarh

హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఛండీఘర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి సిమ్లాకు వెళ్లారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్ర మల్లా రోడ్ ను సందర్శిస్తారు. రాత్రి సిమ్లానే బస చేస్తారు.

Day 02: Shimla

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అక్కడ్నుంచి కుర్పీకి వెళ్తారు. సాయంత్రం స్ఖానికంగా ఉండే పలు ప్రాంతాలను చూస్తారు. రాత్రి సిమ్లాలోనే ఉంటారు.

Day 03: Shimla to Manali

టిఫిన్ తర్వాత... మానాలికి వెళ్తారు. సాయంత్రం వరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 04: Manali

బ్రేక్ ఫాస్ట్ తర్వాత... మానాలి అందాలను వీక్షిస్తారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటారు.

Day 05: Manali

ఐదో రోజు కూడా మరిన్ని ప్రాంతాలకు వెళ్తారు. డిన్నర్ తర్వాత రాత్రి మానాలిలోనే బస చేస్తారు.

Day 06: Manali to Chandigarh

ఉదయం టిఫిన్ తర్వాత... ఛండీఘర్ ఎయిర్ పోర్టుకు ప్రయాణం అవుతారు. సాయంత్రం వరకు అక్కడికి చేరుకుంటారు. రాత్రి ఇక్కడే ఉంటారు.

Day 07: Chandigarh to Hyderabad

ఉదయం టిఫిన్ తర్వాత రాక్ గార్డెన్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఛండీఘడ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ రేట్లు....

టూర్ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 58,550 గా ఉంటుంది. ఇక డబుల్ ఆక్యుపెన్సికీ 44,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 42,300గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఫ్లైట్ వివరాలు కూడా కింద ఇచ్చిన జాబితాలో చూడొచ్చు.

ధరల వివరాలు జాబితా

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.