తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Latest Coastal Karnataka Tour Package From Hyderabad

Coastal Karnataka Tour: హైదరాబాద్ టూ కర్ణాటక.. 11 వేల ధరలో 6 రోజుల ట్రిప్, IRCTC కొత్త ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu

04 May 2023, 14:36 IST

    • IRCTC Coastal Karnataka Tour: కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన డేట్స్, ధరల వివరాలను పేర్కొంది.
మురుడేశ్వర్
మురుడేశ్వర్

మురుడేశ్వర్

IRCTC Coastal Karnataka Tour From Hyd: పలు అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు టూరిస్ట్ ప్లేస్ లను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… మే 16, 2023వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

ACB Arrested Sub Registrar : భూమి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల లంచం, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

Day 1: కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.

Day 2: రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉడిపికి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

Day 3 : కొల్లూరు, ముకాంబికా ఆలయాలకు వెళ్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు చేరుకుంటారు.

Day 4: నాలుగో రోజు ఉదయమే ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన తర్వాత... తిరిగి మురుదేశ్వర్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 5 : ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. కటీల్, మంగలా ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు.

Day 6 : ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు:

ఈ కర్ణాటక టూర్ కు సంబంధించి రేట్లు చూస్తే.... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు 34,270 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19570 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 15,480గా ఉంది. ఇక స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 31, 270, డబుల్ షేరింగ్ కు రూ. 16,570, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12,480 ధరగా నిర్ణయించారు. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింద ఇచ్చిన జాబితాలో ధరలను చెక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ www.irctctourism.com ను సందర్శించొచ్చు.

టూర్ రేట్ల వివరాలు