తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

27 April 2024, 21:49 IST

    • TS Inter Supplementary Schedule : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక కారణంగా మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు
టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు

టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు

TS Inter Supplementary Schedule : తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల(TS Inter Supplementary Time Table) తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మే/జూన్ 2024 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది బోర్డు. ఈ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు మార్చింది. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఈ మార్పులు చేసినట్లు బోర్డు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

TSMS Inter Admissions 2024 : తెలంగాణ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

Hyderabad Crime News : సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఎర..! ఇంటర్వూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..!

Siddipet Murder: సిద్దిపేటలో దారుణం, మద్యం తాగవద్దని చెప్పినందుకు కన్నతండ్రిని పొడిచిన కుమారుడు

ప్రాక్టికల్స్ తేదీల్లో మార్పులు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 04 నుంచి 08వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం మధ్యాహ్నం సెషన్ 2:00 P.M. నుంచి 5:00 PM వరకు ఉంటుంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష (1వ సంవత్సరం విద్యార్థులకు) జూన్ 10, 2024(సోమవారం) ఉదయం 9:00 నుంచి నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 11, 2024న ఉదయం 10:00 AM నుంచి 1:00 PM వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష(2వ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే) జూన్ 12వ తేదీ ఉదంయ 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు(TS Inter Supplementary Time Table)

(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు(TS Inter Supplementary Time Table)

(మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు)

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
  • 29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ సెకండియర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్