TS Inter Supplementary Schedule : తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల(TS Inter Supplementary Time Table) తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేసింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు మే/జూన్ 2024 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ముందుగా మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది బోర్డు. ఈ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు మార్చింది. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఈ మార్పులు చేసినట్లు బోర్డు ప్రకటించింది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 04 నుంచి 08వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం మధ్యాహ్నం సెషన్ 2:00 P.M. నుంచి 5:00 PM వరకు ఉంటుంది. ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష (1వ సంవత్సరం విద్యార్థులకు) జూన్ 10, 2024(సోమవారం) ఉదయం 9:00 నుంచి నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 11, 2024న ఉదయం 10:00 AM నుంచి 1:00 PM వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష(2వ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే) జూన్ 12వ తేదీ ఉదంయ 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 నిర్వహిస్తారు.
(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)
(మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు)
సంబంధిత కథనం