TS Inter Supplementary Exam 2024 : మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే!-hyderabad ts inter results 2024 released ts supplementary exam schedule recounting revaluation details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supplementary Exam 2024 : మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే!

TS Inter Supplementary Exam 2024 : మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే!

Bandaru Satyaprasad HT Telugu
Apr 24, 2024 11:14 AM IST

TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను(TS Inter Results 2024) విద్యాశాఖ అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఫస్టియర్ లో 60.01 శాతం, సెకండియర్ 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫెయిల్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్(TS Inter Supplementary Exams) ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఇంటర్ బోర్డు(Telangana Inter Board) అధికారులు సూచించారు. అలాగే తక్కువ మార్కులు వచ్చినట్లు భావిస్తే విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అడ్వాన్డ్ సప్లిమెంటరీ పరీక్షలను(Advanced Supplementary Exams) మే 24 వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రీకౌంటింగ్(Recounting), రీవెరిఫికేషన్ కు సబ్జెక్టు వారీగా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

రీకౌంటింగ్ , రీవెరిఫికేషన్ (Recounting Reverification)

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకునే విద్యార్థులు ఈ నెల 24 నుంచి మే 2వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని తెలిపింది. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్ కు రూ.100 చెల్లించాల్సి ఉండగా, రీవెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించాలని బోర్డు తెలిపింది. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్(TS Inter Supplementary Exams 2024 Time Table)

అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుచి రెండు సెషన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సప్లిమెంటపరీ పరీక్షలకు అప్లై చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో ఫీజుల చెల్లించాలని బోర్డు తెలిపింది.

మార్కుల మెమోలు డౌన్ లోడ్ (TS Inter Marks Memos Download)

ఆన్ లైన్ మార్కుల మెమోలను కాలేజీల ప్రిన్సిపాల్ లాగిన్ ఐడీలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మార్కుల మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం