తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Nasik Tour Package From Hyderabad

IRCTC Hyd Nasik Tour: హైదరాబాద్ - నాసిక్ టూర్ .. 4 రోజులకు ప్యాకేజీ ఇదే

03 September 2022, 14:01 IST

    • hyderabad Nasik tour package: హైదరాబాద్ నుంచి నాసిక్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ - నాసిక్ టూర్
హైదరాబాద్ - నాసిక్ టూర్ (irctc tourism)

హైదరాబాద్ - నాసిక్ టూర్

irctc tourism announced nasik tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SHIVAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

hyderabad nasik tour: ఈ నెల సెప్టెంబర్ 9 తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Friday: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్ ప్రారంభవుతుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.

Day 02 Saturday: ఉదయం 07.10 గంటలక నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. షిర్డీకి బయల్దేరి హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్రం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

Day 03 Sunday: మూడో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత నాసిక్ కు బయల్దేరుతారు. త్రయంబకేశ్వర్, పంచావతిని సందర్శిస్తారు. సాయంత్రం నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 09.20 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04 Monday: ఉదయం 08.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే.....

hyd nasik tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 12,290 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 7,670 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.6,620 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టాపిక్