తెలుగు న్యూస్ / తెలంగాణ /
SCR : సికింద్రాబాద్ టూ వేలంకన్ని ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్-వేలంకన్ని-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
సికింద్రాబాద్-వేలంకన్ని మధ్య దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నంబర్ 07161 సికింద్రాబాద్-వేలంకన్ని సెప్టెంబర్ 4, 8వ తేదీలలో ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం.07612 వేలంకన్ని-సికింద్రాబాద్ సెప్టెంబర్ 5, 9 తేదీల్లో రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు కాంట్‌లో ఆగుతాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలదుత్తురై, తిరువారూర్ మరియు నాగపట్నం స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
సంబంధిత కథనం