Special Trains: హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే-south central railway announced special trains between various destinations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Various Destinations

Special Trains: హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే

Mahendra Maheshwaram HT Telugu
Aug 21, 2022 10:36 AM IST

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. నర్సాపూర్, హైదరాబాద్, నాగర్ సోల్, యశ్వంత్ పూర, వికారాబాద్ లకు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. తాజాగా యశ్వంత్ పూర, వికారాబాద్, నాగర్ సోల్, యశ్వంత్పూర్, తిరుపతి, నర్సాపూర్ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యక రైలును ప్రకటించింది. ఈట్రైన్ 27వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి - మరునాడు ఉదయం 09.25కు చేరుకుంటుంది. ఇక నాగర్ సోల్ నుంచి - హైదరాబాద్ కు 28వ తేదీన ప్రత్యేక రైలు ఉంది. ఇది రాత్రి 10 గంటలకు ప్రారంభమై... మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక హైదరాబాద్ - యశ్వంతపూర మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరే రైలు... మరుసటి రోజు ఉదయం 10. 30 గంటలకు యశ్వంత్ పూర్ చేరుతుంది. ఇక 26వ తేదీన యశ్వంతపూర నుంచి 04.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ కు చేరుతుంది.

మరోవైపు ఇప్పటికే తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... మరోసారి ప్రకటన చేసింది. ఈనెల 24వ తేదీన సికింద్రాబాద్ నుంచి 09.25 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు... మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు కూడా 25వ తేదీన ప్రత్యేక రైలు ఉంది. ఇది తిరుపతి నుంచి 05.10 గంటలకు బయల్దేరి... మరుసటి రోజు సాయంత్రం 07. 10 గంటలకు గమ్యానికి చేరుతుంది.

సికింద్రాబాద్ - యశ్వంతపూర్ - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఇది 26, 27 తేదీల్లో సర్వీసును అందిచనుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుతుంది. తిరిగి యశ్వంతపూర్ నుంచి సాయంత్రం 05. 20వ తేదీన బయల్దేరి... మరోసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ కు వస్తుంది. 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ కు ప్రత్యేక రైలు ఉంది. ఇది 10.35 గంటలకు బయల్దేరి... మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చేరుతుంది. 28వ తేదీన నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. నర్సాపూర్ - వికారాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది.

South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. తాజాగా యశ్వంత్ పూర, వికారాబాద్, నాగర్ సోల్, యశ్వంత్పూర్, తిరుపతి, నర్సాపూర్ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ - నాగర్ సోల్ మధ్య ప్రత్యక రైలును ప్రకటించింది. ఈట్రైన్ 27వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి - మరునాడు ఉదయం 09.25కు చేరుకుంటుంది. ఇక నాగర్ సోల్ నుంచి - హైదరాబాద్ కు 28వ తేదీన ప్రత్యేక రైలు ఉంది. ఇది రాత్రి 10 గంటలకు ప్రారంభమై... మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక హైదరాబాద్ - యశ్వంతపూర మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరే రైలు... మరుసటి రోజు ఉదయం 10. 30 గంటలకు యశ్వంత్ పూర్ చేరుతుంది. ఇక 26వ తేదీన యశ్వంతపూర నుంచి 04.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ కు చేరుతుంది.

మరోవైపు ఇప్పటికే తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... మరోసారి ప్రకటన చేసింది. ఈనెల 24వ తేదీన సికింద్రాబాద్ నుంచి 09.25 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు... మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు కూడా 25వ తేదీన ప్రత్యేక రైలు ఉంది. ఇది తిరుపతి నుంచి 05.10 గంటలకు బయల్దేరి... మరుసటి రోజు సాయంత్రం 07. 10 గంటలకు గమ్యానికి చేరుతుంది.

సికింద్రాబాద్ - యశ్వంతపూర్ - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఇది 26, 27 తేదీల్లో సర్వీసును అందిచనుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుతుంది. తిరిగి యశ్వంతపూర్ నుంచి సాయంత్రం 05. 20వ తేదీన బయల్దేరి... మరోసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ కు వస్తుంది. 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ కు ప్రత్యేక రైలు ఉంది. ఇది 10.35 గంటలకు బయల్దేరి... మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చేరుతుంది. 28వ తేదీన నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది.

ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

IPL_Entry_Point