SCR: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతికి ప్రత్యేక రైళ్లు-10 summer special trains between kazipet to tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతికి ప్రత్యేక రైళ్లు

SCR: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతికి ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
May 28, 2022 10:07 PM IST

వేసవి సీజన్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చేసింది. కాజీపేట్ - తిరుపతి మధ్య 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను వెల్లడించింది.

<p>10 వేసవి ప్రత్యేక రైళ్లు</p>
10 వేసవి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కాజీపేట్-తిరుపతి మధ్య 10 వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ స్పెషల్ ట్రైన్ (నెం.07091) మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 11 గంటలకు కాజీపేట్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.20 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక ఇదే తేదీల్లో(మే 31, జూన్ 7,14,21,28) రాత్రి 11.40 గం.లకు ప్రత్యే రైలు (నెం.07092) తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.45 గం.లకు కాజీపేట్‌కు చేరుకుంటుంది.

ఈ స్టేషన్ల మీదుగా…

10 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.ఈ రైళ్లు వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో AC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ స్పెషల్ ట్రైన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులు శ్రీవారి దర్శనానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

Whats_app_banner