తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyderabad To Mp Tour : మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ -తక్కువ ఖర్చులో ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ

IRCTC Hyderabad To MP Tour : మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ -తక్కువ ఖర్చులో ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ

20 April 2024, 13:48 IST

    • IRCTC Hyderabad To MP Tour : మధ్యప్రదేశ్ లోని జ్యోతిర్లింగ ప్రదేశాలు సందర్శించేలా ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ రూ.11720 ప్రారంభ ధరతో అందిస్తోంది.
 మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ టూర్
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ టూర్

మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ టూర్

IRCTC Hyderabad To MP Tour : హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్(Hyderabad to Madhya Pradesh) లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని... జ్యోతిర్లింగ దర్శనం(Jyotirlinga darshan) 5రోజుల టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తుంది. రూ.11720 ప్రారంభ ధరతో ప్రతి బుధవారం కాచిగూడ (Kachiguda)నుంచి ట్రైన్ టూర్ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

TS Group 1 Officers Association : గ్రూప్ 1 పోస్టులన్నింటికీ సమాన వేతనం ఇవ్వండి.. సీపీఎస్ రద్దుపై పీఆర్సీ కమిటీకి లేఖ

Current Bill : షాక్ కొట్టిన కరెంట్ బిల్లు, 14 యూనిట్లకు రూ.60 వేల బిల్లు

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్(1-3 ప్రయాణికులు)

క్లాస్ సింగిల్ షేరింగ్డబుల్ షేరింగ్ట్రిబుల్ షేరింగ్చైల్డ్ విత్ బెడ్(5-11 years)చైల్డ్ విత్ అవుత్ బెడ్(5-11 years)
కంఫర్ట్(3AC)రూ.35800రూ.20180రూ.15750రూ.11910రూ.10020
స్టాండర్డ్(SL)రూ.33390రూ.17700రూ.13260రూ.9420రూ.7530

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (4 నుంచి 6 ప్రయాణికులు)

క్లాస్డబుల్ షేరింగ్ట్రిపుల్ షేరింగ్చైల్ విత్ బెడ్(5-11 years)చైల్ విత్ అవుట్ బెడ్(5-11 years)
కంఫర్ట్(3AC)రూ.16580రూ.14210రూ.11910రూ.10020
స్టాండర్డ్(SL)రూ.14100రూ.11720రూ.9420రూ.7530

టూర్ వివరాలు

  • డే 01- బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station) నుంచి సాయంత్రం 4.40 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌(రైలు నం. 12707)లో టూర్ కు బయలుదేరుతారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • డే 02 - గురువారం ఉదయం 08:15 గంటలకు భోపాల్(Bhopal) రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. స్టేషన్ నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ లో ఫ్రెషప్ తర్వాత 40 కిమీ దూరంలో ఉన్న సాంచి స్థూపం సందర్శనకు వెళ్తారు. తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి భోపాల్ చేరుకుని గిరిజన మ్యూజియం విజిట్ చేస్తారు. రాత్రికి భోపాల్‌లో బస ఉంటుంది.
  • డే 03 - శుక్రవారం ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి... చెక్ అవుట్ తర్వాత ఉజ్జయినికి(Ujjain) (200 కి.మీ) బయలుదేరతారు. ఉజ్జయినిలో హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత ఉజ్జయినిలోని స్థానిక దేవాలయాలను సందర్శించవచ్చు. (శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయం) రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు.
  • డే 04 -శనివారం ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి మహేశ్వర్ (165 కి.మీ.)కి బయలుదేరి వెళ్తారు. అక్కడ అహల్యా దేవి కోట & నర్మదా ఘాట్ సందర్శించి, అనంతరం ఓంకారేశ్వర్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత ఓంకారేశ్వర్(Omkareshwar) ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస చేస్తారు.
  • డే 05-ఆదివారం ఉదయం హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇండోర్‌కి(70 కి.మీ.) బయలుదేరతారు. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్రానా గణేష్ మందిర్ విజిట్ చేస్తారు. రాత్రి 8:00 గంటలకు ఇండోర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. అక్కడ రైలు నెం. 19301 రైలు ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • డే 06 - సోమవారం రాత్రి 10:00 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.

హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి