IRCTC Kanyakumari Tour : కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?-kanyakumari rameswaram madurai irctc 5 days tour package from chennai egmore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Kanyakumari Tour : కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?

IRCTC Kanyakumari Tour : కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?

Bandaru Satyaprasad HT Telugu
Apr 17, 2024 01:40 PM IST

IRCTC Kanyakumari Tour : ఈ వేసవిలో కన్యాకుమారి, రామేశ్వరం, మధురైలోని ప్రముఖ ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే ఐఆర్సీటీసీ చెన్నై ఎగ్మోర్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

 ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Kanyakumari Tour : వేసమి సెలవుల్లో కుటుంబంతో ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదంగా గడపేందుకు ఐఆర్సీటీసీ (IRCTC Tour Package)చెన్నై ఎగ్మోర్ నుంచి కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రూ.9800 ప్రారంభ ధరతో 5 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. చెన్నై ఎగ్మోర్ నుంచి 8 SL, 8- 3AC బెర్తుల రైలును ప్రతి గురువారం నడుపుతున్నారు.

కన్యాకుమారి, రామేశ్వరం, ముధురై టూర్

మధురై(Madurai)ని ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. మధురై తమిళనాడులోని పురాతన నగరం. ఉత్తమ మల్లె పువ్వుల పంటల ఉత్పత్తికి పేరొందింది. మధురై మీనాక్షి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కన్యాకుమారి(Kanyakumari)...భారతదేశ దక్షిణ భాగంలో చివరి ప్రాంతం. మూడు మహాసముద్రాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే స్థానం కన్యాకుమారి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందమైన దృశ్యాలకు కన్యాకుమారి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. రామనాథస్వామి దేవాలయం పొడవైన ఆలయ కారిడార్‌కు ప్రసిద్ధి. దక్షిణాది బెనారస్ పిలిచే రామేశ్వరాన్ని(Rameswaram) కాశీకి తీర్థయాత్ర పూర్తైన తర్వాత సందర్శిస్తుంటారు.

టూర్ ట్రావెల్- చెన్నై - కన్యాకుమారి - రామేశ్వరం - మధురై-చెన్నై

టూర్ వివరాలు

  • డే 01 : చెన్నై ఎగ్మోర్(Channai Egmore) రైల్వే స్టేషన్ నుంచి ఆనందపురి ఎక్స్ ప్రెస్ రైలు (నెం. 20635) సాయంత్రం 19.50 గంటలకు బయలుదేరుతుంది.
  • డే 02 : నాగర్‌కోయిల్ రైల్వే స్టేషన్‌కి ఉదయం 07:40 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి కన్యాకుమారి(Kanyakumari)లోని హోటల్ కు తీసుకెళ్తారు. హోటల్ నుంచి ఉదయం 11:00 గంటలకు బయలుదేరి కుమారి అమ్మన్ ఆలయం, త్రీ సీస్ మింగిల్ పాయింట్, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహం, మహాత్మా గాంధీ స్మారక మండపం విజిట్ ఉంటుంది. ( పర్యాటకులను కుమారి అమ్మన్ టెంపుల్ దగ్గర దింపుతారు. అక్కడి నుండి పర్యాటకులు మిగతా అన్ని ప్రదేశాలను సొంత ఖర్చులతో సందర్శించాలి. అన్ని ప్రదేశాలు నడవడానికి వీలుగా దగ్గరానే ఉంటాయి). సన్ సెట్ పాయింట్, వాక్స్ మ్యూజియం సందర్శించవచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం మార్కెట్ వద్ద డ్రాప్ చేస్తారు. రాత్రి బస కన్యాకుమారిలో ఉంటుంది.
  • డే 03: మీ సొంతంగా వెళ్లి సముద్ర తీరంలో సూర్యోదయాన్ని వీక్షించవచ్చు. ఉదయం 08:30 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గంలో రామేశ్వరం చేరుకుని తిరుచెందూర్ ఆలయాన్ని సందర్శిస్తారు. రామేశ్వరం చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో(Rameswaram) బస ఉంటుంది.
  • డే 04: తెల్లవారుజామున 05:00 గంటలకు, రామనాథస్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లాలి. ఆ తర్వాత రామర్పాదం ఆలయాన్ని, ఐదు ముఖాల హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హోటల్‌కు తిరిగి రావాలి. ఉదయం 11:30 గంటలకు మధురైకి సార్ట్ అవుతారు. మధురైలో తిరుపురం-కుండ్రం మురుగన్ ఆలయం, తిరుమలై నాయకర్ మహల్, మీనాక్షి అమ్మ(Madurai Meenakshi Temple) ఆలయాన్ని సందర్శిస్తారు. మధురై రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6:00 గంటలకు డ్రాప్ చేస్తారు. ఆనందపురి ఎక్స్‌ప్రెస్‌( రైలు నంబర్ 20636) రాత్రి 9.50 గంటలకు తిరిగి చెన్నై బయలుదేరుతుంది.
  • డే 05: ఆనందపురి ఎక్స్ ప్రెస్ లో ఉదయం 06.10 గంటలకు చెన్నై ఎగ్మోర్(Chennai Egmore) చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

అనంతపురి స్పెషల్ ఎక్స్‌ప్రెస్(రైలు నెం. 16823) చెన్నై ఎగ్మోర్ నుంచి ప్రతి గురువారం రాత్రి 20.10 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ బయలుదేరే సమయానికి 4 రోజుల ముందు ఆన్‌లైన్ టిక్కెట్లు ఓపెన్ అవుతాయి. ఇందులో స్లీపర్ క్లాస్ - 8, 3AC క్లాస్ - 8 బెర్తులు ఉంటాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం