IRCTC Kerala Tour Package : కేరళ మున్నార్, కొచ్చి రైల్ టూర్- 6 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Kerala Tour Package : హాట్ సమ్మర్ లో కూల్ గా కేరళలో టూర్ కు వెళ్లాలనుకుంటే ఐఆర్సీటీసీ 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రూ. 13810 స్టార్టింగ్ ధరతో బెంగళూరు నుంచి మున్నార్, కొచ్చి, ఇతర ప్రాంతాల్లో పర్యటించవచ్చు.
IRCTC Kerala Tour Package : సమ్మర్ లో కూల్ గా కేరళ(Kerala Tour)లో ఓ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ(IRCTC Tour Package) రైలు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. బెంగళూరు(Bengaluru) నుంచి 6 రోజుల పాటు కేరళలోని మున్నార్(Munnar), కొచ్చి(Kochi), అతిరాపల్లి(Athirapally) రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళ(Kerala) అంటే మనకు గుర్తొచ్చేవి బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, ప్రశాంతమైన పల్లెలు, ప్రకృతి సౌందర్యం. కేరళను దేవుని సొంత దేశం అని కూడా పిలుస్తుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉంటే కేరళ పర్యాటక ప్రదేశాలకు(Kerala Tourist Places) ఫేమస్. సమ్మర్ సెలవుల్లో తప్పకుండా మీరు చూడాల్సిన ప్రదేశాల్లో కేరళ ఒకటి. ఈ పర్యటన ఎర్నాకుళం, మున్నార్ (2 నైట్స్), కొచ్చి(1 నైట్), అతిరాపల్లి, త్రిస్సూర్- మొత్తం ఐదు రాత్రులు/ఆరు రోజుల్లో సాగుతోంది.
ప్రతి గురువారం బెంగళూరు నుంచి ప్రత్యేక రైలు ఈ టూర్ కు బయలుదేరుతుంది. ఈ రైలులో బెర్త్‌ల సంఖ్య స్లీపర్ క్లాస్ - 06 (స్టాండర్డ్), 3ఏసీ క్లాస్- 6 (కంఫర్ట్).
టూర్ ప్యాకేజీ టారిఫ్(ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ధర)
క్లాస్ | సింగిల్ షేరింగ్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) |
కంఫర్ట్ | రూ.35450 | రూ.19480 | రూ.16020 | రూ.13360 | రూ.10570 |
స్టాండర్డ్ | రూ.33240 | రూ.17280 | రూ.13810 | రూ.11150 | రూ.8370 |
టూర్ వివరాలు
- డే 01 : బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి రైలు(నెం. 16526) రాత్రి 08:10 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- డే 02 : రైలు ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక ఉదయం 07:20 గంటలకు పికప్ ఉంటుంది. రోడ్డు మార్గంలో మున్నార్‌కు తీసుకెళ్తారు. హోటల్‌కి చెక్ ఇన్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం టీ మ్యూజియాన్ని విజిట్ చేయవచ్చు. మున్నార్‌లో రాత్రి స్టే చేస్తారు.
- డే 03 : ఎర్నాకుళం(Ernakulam) నేషనల్ పార్క్ లేదా టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ విజిట్ ఉంటుంది. మధ్యాహ్నం మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా సరస్సు సందర్శించవచ్చు. మున్నార్ పట్టణంలో సాయంత్రం షాపింగ్ చేయవచ్చు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.
- డే 04 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం 08: 00 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్నాకుళం వెళ్లి అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యాక మధ్యాహ్నం 2.30కి కొచ్చి టూర్ ఉంటుంది. మట్టాన్‌చేరీలోని డచ్ ప్యాలెస్, జ్యూ సినాగోగ్‌ను విజిట్ చేయవచ్చు. తర్వాత సెయింట్ ఫ్రాంక్ చర్చ్, ఫోర్ట్ కొచ్చిలో చైనీస్ ఫిషింగ్ నెట్స్.. తర్వాత స్థానిక షాపింగ్ కోసం మెరైన్ డ్రైవ్, బ్రాడ్‌వేకి తీసుకెళ్తారు. షాపింగ్ చేసిన తర్వాత రాత్రి 8 గంటలకు హోటల్ వద్ద డ్రాప్ చేస్తారు.
- డే 05 : అతిరాపల్లి, వజాచల్ వాటర్ ఫాల్స్(Water Falls)కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు రోడ్డు మార్గంలో త్రిసూర్‌కు వెళ్తారు. మార్గమధ్యలో పారమెక్కావు భగవతి ఆలయం, వడక్కుమ్నాథన్ టెంపుల్ సందర్శించవచ్చు. తర్వాత సాయంత్రం 6.40 గంటలకు త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి రాత్రి 07.40 గంటలకు బెంగళూరు రైలు(నంబర్ 16525) ఎక్కుతారు.
- డే 06 : బెంగళూరు(Bengaluru) సిటీ రైల్వే స్టేషన్‌కి ఉదయం 06:40 గంటలకు చేరుకుంటారు. దీంతో మీ టూర్ ముగుస్తుంది.
విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమాన సర్వీసుల కోసం క్లిక్ చేయండి
సంబంధిత కథనం