Kodaikanal Tour : ఈ సమ్మర్ లో కొడైకెనాల్ చూసొద్దామా? ఐఆర్సీటీసీ 5 రోజుల ట్రిప్ వివరాలు ఇలా?-chennai kodaikanal summer trip irctc five days tour package available ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kodaikanal Tour : ఈ సమ్మర్ లో కొడైకెనాల్ చూసొద్దామా? ఐఆర్సీటీసీ 5 రోజుల ట్రిప్ వివరాలు ఇలా?

Kodaikanal Tour : ఈ సమ్మర్ లో కొడైకెనాల్ చూసొద్దామా? ఐఆర్సీటీసీ 5 రోజుల ట్రిప్ వివరాలు ఇలా?

Bandaru Satyaprasad HT Telugu
Apr 03, 2024 02:49 PM IST

Kodaikanal Tour : సమ్మర్ లో కూల్ గా కుటుంబంతో కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ చెన్నై నుంచి కొడైకెనాల్ 5 రోజుల ప్యాకేజీ అందిస్తుంది.

కొడైకెనాల్ ట్రిప్
కొడైకెనాల్ ట్రిప్

Kodaikanal Tour : ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్(Kadaikanal Trip) పర్యాటకులకు బెస్ట్ స్పాట్. సుందమైన ప్రకృతి, లోయలు, సుందరమైన జలపాతాలు(Water Falls), రోలింగ్ హిల్స్, స్పష్టమైన సరస్సులు అన్నీ కలిసి పర్వత విహారానికి మీ వేసవి ట్రిప్ కు చక్కటి ప్రదేశం. కొడైకెనాల్ మీ రోజువారీ నగర జీవితంలోని కష్టాల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఈ హిల్ స్టేషన్ లో బైకింగ్ లేదా ట్రెక్కింగ్(Trekking) ట్రయల్స్‌లో బయలుదేరినప్పుడు లేదా చుట్టుపక్కల ఉన్న భారీ అడవులలో షికారు చేస్తున్నప్పుడు మీరు ప్రకృతితో కనెక్ట్ అయిపోతారు. చెన్నై నుంచి ఐదు రోజుల కొడైకెనాల్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC Package) అందిస్తుంది. ప్రతీ గురువారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.

టూర్ మ్యాప్ - చెన్నై - కొడైకెనాల్ - మధురై - చెన్నై

  • డే 1 - అనంతపురి ఎక్స్‌ప్రెస్(రైలు నెం. 20635 ) చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి రాత్రి 07.50 గంటలకు బయలుదేరుతుంది.
  • డే 2 -తెల్లవారుజూమున 03.20 గంటలకు మధురై రైల్వే స్టేషన్ చేరుకుంటారు. మధురై రైల్వే స్టేషన్ నుంచి పికప్ ఉంటుంది. రోడ్డు మార్గంలో కొడైకెనాల్‌కు చేరుకుంటారు. కొడైకెనాల్‌లోని హోటల్‌కు చేరుకుంటారు. ఇక్కడ గ్రీన్ వ్యాలీ వ్యూ, కోకర్స్ వాక్, పిల్లర్ రాక్ చూడవచ్చు. కొడైకెనాల్‌లో ఓవర్‌నైట్ హాల్ట్ ఉంటుంది.
  • డే 3 - లేక్ వ్యూ, బోట్ రైడ్స్, పైన్ ఫారెస్ట్, గుణ గుహలు, మ్యూజియం సందర్శించవచ్చు. కొడైకెనాల్‌లో ఓవర్‌నైట్ హాల్ట్ ఉంటుంది.
  • డే 4 -కొడైకెనాల్ లోని హోటల్ నుంచి ఉదయం 09:00 గంటలకు చెక్ అవుట్ చేస్తారు. తిరుగు ప్రయాణంలో మధురైకి చేరుకుంటారు. అక్కడ సిల్వర్ క్యాస్కేడ్‌ని సందర్శిస్తారు. మధురై చేరుకుని - మీన్‌కాశి అమ్మన్ ఆలయం, తిరుమలై నాయకర్‌మహల్‌ని సందర్శించవచ్చు. మధురై రైల్వే స్టేషన్‌లో రాత్రి 9.50 గంటలకు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి అనంతపురి ఎక్స్‌ప్రెస్ ( రైలు నెం. 20636) ద్వారా చెన్నైకి తిరుగు ప్రయాణం ఉంటుంది.
  • డే 5- ఉదయం 06.10 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

రైలు బెర్త్‌ల సంఖ్య : స్లీపర్ క్లాస్ - 8, 3AC క్లాస్ - 8

ప్యాకేజీ టారిఫ్ వివరాలు

క్లాస్(Standard)సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ విత్ అవుట్ బెడ్
(1-3 Pax)రూ.23700రూ.13200రూ.10600రూ.7800రూ.6830
(4-6 Pax)-రూ.11230రూ.10470రూ.9960రూ.9005

ప్యాజేజీ టారిఫ్ వివరాలు

క్లాస్(కంఫర్ట్)సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ విత్ అవుట్ బెడ్
(1-3 Pax)రూ.25840రూ.15330రూ.12730రూ.9915రూ.8970
(4-6 Pax)-రూ.13360రూ.12600రూ.12100రూ.11140

  • హైదారాబాద్ నుంచి చెన్నైకు -ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్, చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
  • విజయవాడ నుంచి చెన్నైకు -చార్మినార్ ఎక్స్ ప్రెస్, పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గంగా కావేరి ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం