Hyderabad Leh Tour : హైదరాబాద్ టు లడఖ్ లేహ్ కు సమ్మర్ ట్రిప్, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-hyderabad to leh irctc air tour package summer holiday trip 6 nights ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Leh Tour : హైదరాబాద్ టు లడఖ్ లేహ్ కు సమ్మర్ ట్రిప్, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Hyderabad Leh Tour : హైదరాబాద్ టు లడఖ్ లేహ్ కు సమ్మర్ ట్రిప్, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Bandaru Satyaprasad HT Telugu
Mar 31, 2024 11:00 PM IST

Hyderabad Leh Tour : హైదరాబాద్ నుంచి లడఖ్ లేహ్ ఎయిర్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది ఐఆర్సీటీసీ. 6 రాత్రులు, 7 రోజుల టూర్ లో లేహ్ లో అద్భుతమైన ప్రదేశాలు సందర్శించవచ్చు.

హైదరాబాద్ టు లడఖ్ లేహ్ కు సమ్మర్ ట్రిప్
హైదరాబాద్ టు లడఖ్ లేహ్ కు సమ్మర్ ట్రిప్

Hyderabad Leh Tour : స్కూళ్లకు, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్(Summer) స్టార్ట్ అవుతున్నాయి. కుటుంబంతో హాలీడే ట్రిప్(Holiday Trip) ప్లాన్ చేస్తున్నారా?. అయితే ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి లడఖ్ లేహ్(Hyderabad To Leh) ఎయిర్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ లో ల్యాండ్ ఆఫ్ పాసెస్ గా పేరొందిన లడఖ్ లోని సుందర ప్రదేశాలను చుట్టేసి రావొచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC Tour Package) హైదరాబాద్ నుంచి లడఖ్‌కు ఎయిర్ ప్యాకేజీ ప్రారంభించింది. ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి లడఖ్‌కు ఫిక్స్‌డ్ డిపార్చర్ టూర్‌లను ప్రారంభించింది. ఈ టూర్ లో షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, టర్టుక్ , పాంగోంగ్‌ ప్రాంతాలను కవర్ చేస్తారు. ఐఆర్సీటీసీ(IRCTC) లడఖ్ టూర్ ప్యాకేజీలో పర్యాటకలను మంత్ర మంత్రముగ్ధులను చేసే సుందరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. టూర్ ప్రారంభ తేదీ మే 21, 2024.

ఫ్లైట్ వివరాలు(Flight Details)

ఫ్లైట్ నెంబర్ఎక్కడ నుంచిసమయంఎక్కడ వరకుసమయం
6E-2379/2049హైదరాబాద్ 6.00 గంటలకులేహ్(దిల్లీ మీదుగా)10.50 గంటలకు
6E-2007/6282లేహ్8.30 గంటలకుహైదరాబాద్(దిల్లీ మీదుగా)14.30 గంటలకు

టూర్ ప్యాకేజీ ధర (Tour Package)

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీ ట్రిపుల్ ఆక్యుపెన్సీచెల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు)చెల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు)పిల్లలు(2-4 సంవత్సరాలు)
కంఫర్ట్రూ.65670రూ.60755రూ.60200రూ.58890రూ.54070రూ.39445

 

టూర్ ఇలా - హైదరాబాద్-లేహ్-షామ్ వ్యాలీ-నుబ్రా-పాంగాంగ్-తుర్తుక్-లేహ్-హైదరాబాద్ (06 రాత్రులు/07 రోజులు)

హైదరాబాద్ - లేహ్(Hyderabad-Leh)

హైదరాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) మొదటి రోజు ఉదయం 4 గంటలకు రిపోర్ట్ చేయాలి. 6 గంటలకు విమానం ఎక్కి, 10.50 గంటలకు లేహ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్ వెళ్లి చెక్ ఇన్ అవుతారు. లేహ్ లో పరిస్థితులను అలవాటు పడటానికి మొదటి రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఎత్తైన ప్రదేశాలకు త్వరగా అలవాటు పడొచ్చు.

లేహ్ టూర్ ప్యాకేజీలో సదుపాయాలు

  • హైదరాబాద్- లేహ్- హైదరాబాద్ విమాన ఛార్జీలు
  • లేహ్ (3 రాత్రులు), నుబ్రా (2 రాత్రులు), పాంగోంగ్ (ఒక నైట్)లో వసతి సౌకర్యం
  • సందర్శన ప్రదేశాలకు వెళ్లేందుకు షేరింగ్ ప్రాతిపదికన నాన్ ఏసీ వాహనం
  • టూర్ లో ఆరు అల్పాహారం, ఆరు లంచ్‌లు, ఆరు డిన్నర్లు
  • లేహ్‌కు చేరుకున్నప్పుడు సంప్రదాయబద్దమైన స్వాగతం
  • ప్రయాణ బీమా, గైడ్ సదుపాయం, సాంస్కృతిక ప్రదర్శన
  • ప్రతి వ్యక్తికి రోజూ ఒక లీటరు డ్రింకింగ్ వాటర్ బాటిల్
  • అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్
  • ఎయిర్ టూర్ లో మొత్తం సీట్లు : 29

హైదరాబాద్-లేహ్ ఎయిర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Whats_app_banner

సంబంధిత కథనం