ఏపీలోని హిల్ స్టేషన్లలో అరకు, లంబసింగి, మారేడుమిల్లి, నల్లమల కొండలు ఫేమస్. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వృక్షాలు, జంతువులను చూడొచ్చు.
facebook
By Bandaru Satyaprasad Apr 03, 2024
Hindustan Times Telugu
లంబసింగి- విశాఖ జిల్లాలో మనోహరమైన ప్రాంతం లంబసింగి. హనీమూన్ స్పాట్ గా ప్రసిద్ధి. ఆంధ్రా కశ్మీర్ గా పిలిచే లంబసింగిలో ప్రకృతి మంత్రముగ్దుల్ని చేస్తుంది. వేసవి నెలల్లో లంబసింగి సందర్శించడానికి మంచి స్పాట్. ఇక్కడ కొత్తపల్లి జలపాతాలు, హోప్ ఐలాండ్ చూడవచ్చు.
facebook
లంబసింగి చేరుకోవడానికి వైజాగ్ నుంచి 100 కి.మీ బస్సు లేదా కారులో ప్రయాణించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి ప్రైవేట్ కారులు అందుబాటులో ఉంటాయి. లంబసింగిని ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో లేదా నవంబర్ నుంచి జనవరి మధ్యలో సందర్శిస్తే బాగుంటుంది.
facebook
అరకు లోయ- అరకు లోయ మరో ప్రకృతి మణిహారం. సుందరమైన ప్రకృతి మనల్ని కట్టిపడేస్తుంది. వైజాగ్ కు సమీపంలో ఉంటుంది. పచ్చని కొండలు, నిర్మలమైన ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అరకు లోయను ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలుస్తారు.
అరకు లోయకు చేరుకోవడానికి వైజాగ్ నుంచి రైలు లేదా కారులో ప్రయాణించాలి. రైలు మార్గం చాలా బాగుంటుంది. కొండలు, సొరంగాలను దాటుతూ వెళ్తుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో వెళ్లేందుకు ఉత్తమ సమయం.
facebook
నల్లమల కొండలు- నల్లమల కొండలు ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు చక్కని ప్రాంతం. ఇక్కడ నదులు, దట్టమైన అడవులు, సుందరమైన తోటలు ఉంటాయి. శ్రీశైలం ఆనకట్ట, ఆలయం, కంబమ్‌లో పొద్దుతిరుగుడు పొలాలు, నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ను చూడవచ్చు.
facebook
నల్లమల హిల్ స్టేషన్ కు చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 232 కి.మీ ప్రయాణించాలి. మార్చి నుంచి మే లేదా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో నల్లమల చూడడానికి ఉత్తమం.
facebook
మారేడుమిల్లి- తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి టూరిస్ట్ ప్లేస్. ఇక్కడి జీవవైవిధ్యం, ప్రవాహాలు, అడవులు, ట్రెక్కింగ్ మార్గాలు ఎక్స్ ప్లోర్ చేయవచ్చు. జలతరంగిణి, అమృతధార, రంప జలపాతం, సోకులేరు వాగు, మన్యం వ్యూపాయింట్ తప్పక చూడవలసిన ప్రదేశాలు. అభయారణ్య ఫారెస్ట్ రెస్ట్ హౌస్ లో బస చేయవచ్చు.
facebook
మారేడుమిల్లి చేరుకునేందుకు దగ్గర ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ రాజమండ్రిలో ఉన్నాయి. రాజమండ్రి నుంచి బస్సులో మారేడుమిల్లి చేరుకోవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి వరకు మారేడుమిల్లి చూసేందుకు ఉత్తమ సమయం.
facebook
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేదెలా...? 7 ముఖ్యమైన విషయాలు