తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Group 1 Officers Association : గ్రూప్ 1 పోస్టులన్నింటికీ సమాన వేతనం ఇవ్వండి.. సీపీఎస్ రద్దుపై పీఆర్సీ కమిటీకి లేఖ

TS Group 1 Officers Association : గ్రూప్ 1 పోస్టులన్నింటికీ సమాన వేతనం ఇవ్వండి.. సీపీఎస్ రద్దుపై పీఆర్సీ కమిటీకి లేఖ

08 May 2024, 15:50 IST

google News
    • TS Group 1 Officers Association : గ్రూప్ 1 పోస్టులన్నింటికి సమాన వేతనాలు ఉండాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీకి సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి లేఖను అందజేశారు.
పీఆర్సీ కమిటీకి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి
పీఆర్సీ కమిటీకి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి

పీఆర్సీ కమిటీకి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి

Telangana Group-I Officers Association :  గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియమించే పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం పేర్కొంది.  వీటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా  ప్రతిపాదనలు అందించాలని పీఆర్సీ కమిటీకి లేఖను అందజేసింది.

బుధవారం తెలంగాణ గ్రూప్ - 1 అధికారుల సంఘం ప్రతినిధులు  పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ శ్రీ శివ శంకర్ ను కలిసి విజ్ఞప్తి అందజేశారు.  గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్ సివిల్ సర్వీస్ గా గ్రూప్ 1 సర్వీస్ లోని పోస్టులను పరిగణించడంతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా గ్రూప్ 1 అధికారులను నియమించే సిఫార్సులు చేయాలని లేఖలో ప్రస్తావించారు. కాలానుగుణంగా పదోన్నతులు ఇచ్చేలా చూడాలని కోరారు.

పాత పెన్షన్ విధానం పునరుద్ధరించండి…

సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా చూడాలని అధికారుల బృందం కోరింది. 2004 కన్నా ముందు జారీ అయిన నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశంలో గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆఫ్ లైన్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

TSPSC Group 1 Preliminary Exam 2024 : గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష(TSPSC Group 1 Preliminary Exam)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్‌టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

పేపర్ లీకేజ్ వ్యవహారం(TSPSC Paper Leak Case) తర్వాత…. పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహిస్తోంది టీఎస్పీఎస్సీ. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TS Group 1 Preliminary Exam) పరీక్ష కూడా ఇదే తరహాలో ఉంటుందని భావించారు. కానీ ఆఫ్ లైన్ లో విధానంలో పరీక్ష ఉంటుందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ విడుదలైన సమయంలోనే…. పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది టీఎస్పీఎస్సీ(TSPSC). ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఓఎంఆర్‌ లేదా సీబీఆర్‌టీ విధానంలో నిర్వహించే అవకాశముందని తెలిపింది. దీనిపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే గ్రూప్‌-1కు(Group 1 Preliminary Exam Applications) భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 4.03 లక్షల అప్లికేషన్లు రావటంతో…. పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అంచనా వేసింది. దీంతో… ఈసారి జరగబోయే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. 

తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 14వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ టీఎస్పీఎస్సీ మరో రెండు పొడిగించింది. దీంతో మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.

తదుపరి వ్యాసం