TSPSC AO 2024 : టీఎస్పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ల షార్ట్ లిస్ట్ విడుదల-ఈ నెల 18, 19న సర్టిఫికేట్ల వెరిఫికేషన్
TSPSC AO 2024 Results : తెలంగాణ వ్యవసాయ అధికారి నియామకానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 148 పోస్టులకు 345 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.
TSPSC AO 2024 Results : తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ లిస్ట్(TSPSC Agriculture Officer Results) ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఏప్రిల్ 18, 19 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్(TSPSC Certificate Verification) చేయనున్నారు. వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుకు 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు ఈ నెల 18, 19 తేదీల్లో నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉదయం 10.30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచారు. అయితే అభ్యర్థులు వెరిఫికేషన్ వచ్చేటప్పుడు అవసరమైన అన్ని పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వచ్చే అభ్యర్థులు తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురావాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అలా తీసుకురాని పక్షంలో మరోసారి అవకాశం ఇవ్వమని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఏప్రిల్ 16 నుంచి 19 వరకు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థికి కేటాయించిన తేదీలో వెరిఫికేషన్ కు హాజరుకాకపోతే అతని మరోసారి అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
345 మంది షార్ట్ లిస్ట్
అగ్రికల్చర్ ఆఫీసర్(Agriculture Officer) రాత పరీక్ష ద్వారా మొత్తం 345 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల వెరిఫికేష్ కోసం టీఎస్పీఎస్సీ(TSPSC) షార్ట్ లిస్ట్ చేసింది. 2023 మే 16, 148 అగ్రికల్టర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సాధారణ అభ్యర్థులు 1:2 నిష్పత్తిలో, పీహెచ్ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. అయితే 1:5 నిష్పత్తిలో PH ఖాళీలకు 20 అభ్యర్థుల కొరత ఉండగా, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.
షార్ట్ లిస్ట్(Short List) అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికేట్లు
1) చెక్‌లిస్ట్ (అభ్యర్థి పూరించాల్సిన ప్రాథమిక సమాచారం, టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్(TSPSC Website) నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి)- 1 సెట్
2) సబ్మిట్ చేసిన దరఖాస్తు (కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నది)
3) హాల్ టికెట్
4) పుట్టిన తేదీ సర్టిఫికేట్ (SSC మెమో)
5) తెలంగాణ ప్రభుత్వం అథారిటీ ద్వారా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ లేదా నివాస ధృవీకరణ పత్రం(అభ్యర్థులు ప్రైవేట్‌గా లేదా ఓపెన్ స్కూల్‌లో చదువుకున్నవారు).
6) తాత్కాలిక లేదా కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో (గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్)
7) తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్(Caste Certificate) తండ్రి/తల్లి పేరుతో.
8) తండ్రి పేరుతో బీసీ కమ్యూనిటీ అభ్యర్థులకు నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్(ఫార్మాట్ టీఎస్పీఎస్సీ వెబ్ లైట్ లో అందుబాటులో ఉంది)
9) తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి(రెగ్యులర్) విషయంలో వయో సడలింపు రుజువుకు సంబంధిత శాఖ నుంచి సర్వీస్ సర్టిఫికేట్లు, NCC ఇన్‌స్ట్రక్టర్ సర్టిఫికేట్/ రిట్రెంచ్డ్ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్, మాజీ సైనికుల సర్టిఫికేట్ ఏదైనా ఉంటే.
10) PH అభ్యర్థుల విషయంలో వైకల్యం సర్టిఫికేట్ (SADAREM సర్టిఫికేట్). PH అభ్యర్థులు సంబంధిత మెడికల్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
11) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి దరఖాస్తు చేసిన సంవత్సరానికి ముందు ఆర్థిక సంవత్సరానికి ఆదాయ ధృవీకరణ పత్రం
12) సర్వీస్ లో ఉన్న అభ్యర్థులు యజమాని నుంచి NOC
13) గెజిటెడ్ అధికారి సంతకం చేసిన 2 సెట్ల అటెస్టేషన్ ఫారమ్‌లు(TSPSC వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నవి)
14) నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా ఇతర సంబంధిత పత్రం
సంబంధిత కథనం