తెలుగు న్యూస్  /  Telangana  /  Hurun India Rich List 2022 Top 10 Billionaires In Hyderabad Here Is Names And Wealth Details

Hyderabad Top 10 Billionaires : హైదరాబాద్‌లోని టాప్ 10 బిలియనీర్లు వీళ్లే

Anand Sai HT Telugu

22 September 2022, 14:46 IST

    • Hurun India Rich List 2022 : హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ ' ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022'ని విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌లోని టాప్ 10 బిలియనీర్లు కూడా చోటు దక్కించుకున్నారు.
హైదరాబాద్ బిలియనీర్స్ లిస్ట్
హైదరాబాద్ బిలియనీర్స్ లిస్ట్

హైదరాబాద్ బిలియనీర్స్ లిస్ట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుండి 79 మంది వ్యక్తులు ఈ జాబితాలో స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరిలో 64 మంది హైదరాబాద్‌కు చెందిన వారు. మురళీ దివి, దివీస్ లేబొరేటరీస్‌కు చెందిన కుటుంబ ప్రమోటర్లు రూ.56,200 కోట్ల సంపదతో ఏపీ, తెలంగాణ(Telangana)లో అగ్రస్థానంలో ఉన్నారు. హెటిరోకు చెందిన పార్థసారధి రెడ్డి రూ. 39,200 కోట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. రూ. 16,000 కోట్లతో ఎంఎస్‌ఎన్ ల్యాబ్‌లకు చెందిన ఎం.సత్యనారాయణ రెడ్డి జాబితాలో ఉన్నారు..

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

బయోలాజికల్ ఈ(Biological E)కి చెందిన మహిమ దాట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యంత ధనిక మహిళగా ఉన్నారు. రూ.8,700 కోట్లతో ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బిలియనీర్ల జాబితాలో 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హురున్, ఐఐఎఫ్ఎల్(IIFL) సంపద చేసిన విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రిచ్ లిస్టర్ల సంపద రూ. 3,90,500 కోట్లుగా ఉంది.

మై హోమ్ ఇండస్ట్రీస్(My Home Industries) అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబం రూ.13,300 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పీపీ.రెడ్డి రూ.12600 కోట్లతో ఆరోస్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పీవీ కృష్ణారెడ్డి(PV Krishna Reddy) రూ.12100 కోట్లతో ఏడో స్థానం దక్కింది. డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ కే.సతీశ్ రెడ్డి, ఆయన కుటుంబం రూ.11300 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. సువెన్ ఫార్మాసూటికల్స్(Suven pharmaceuticals) వెంకటేశ్వర్లు జాస్తి, ఆయన కుటుంబం తొమ్మిదో స్థానంలో రూ.9000 కోట్లతో కొనసాగుతున్నారు.