తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gold Silver Rate Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర… హైదరాబాద్​లో ఎంతంటే

Gold Silver Rate Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర… హైదరాబాద్​లో ఎంతంటే

25 September 2022, 6:53 IST

    • Gold and Silver Price today 25 september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే శనివారం ధర భారీగా పెరగగా... ఇవాళ భారీగానే తగ్గుముఖం పట్టింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,240గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు తగ్గింది.
బంగారం వెండి ధరలు,
బంగారం వెండి ధరలు,

బంగారం వెండి ధరలు,

Gold silver price today 25 september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. శనివారం ధరలు భారీగా పెరగగా... ఇవాళ మరోసారి భారీగానే దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.500 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం పై కూడా రూ. 530 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,200గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 500 తగ్గి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.61,500గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,000గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,200గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 61,500 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,150గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,350 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,050గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,200గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,000 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 1110 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,3100గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,310గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.