తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gold Silver Rate Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. హైదరాబాద్​లో ఎంతంటే

Gold Silver Rate Today: తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధర.. హైదరాబాద్​లో ఎంతంటే

22 September 2022, 6:52 IST

    • Gold and Silver Price today 22nd september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే బుధవారం ధర కాస్త పెరగగా... ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,960గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.
బంగారం వెండి ధరలు,
బంగారం వెండి ధరలు,

బంగారం వెండి ధరలు,

Gold silver price today 22 september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం ధరలు కాస్త పెరగగా... ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.150 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం పై కూడా రూ. 170 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,9600గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,800 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 200 పెరిగి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.62,200గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.45,800గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 49,960గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 62,200 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,110 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,850గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,040 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,960గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,800 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 540 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,580గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,580గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.