తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహిళలు.. పోలీసుల విచారణ

Hyderabad News : అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహిళలు.. పోలీసుల విచారణ

HT Telugu Desk HT Telugu

27 September 2022, 18:31 IST

    • Hyderabad Durgamata Idol Vandalising : హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్ బస్తీలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భాగ్యనగరంలో విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలు అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులో ఉన్న వారు.. మతిస్తిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఉదయం ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి పూజ జరుగుతోంది. అదే సమయంలో ఇద్దరు మహిళలు మండపంలోపలికి వచ్చారు. పూజారి వద్దు అన్నా.. వినకుండా తమతో తెచ్చుకున్న రాడ్డుతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఓ యువకుడు అక్కడే ఉన్నాడు. వారిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు. అతనిపై దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

అయితే ఈ మహిళలు అక్కడతో ఆగకుండా.. సమీపంలోని మరియమాత విగ్రహం దగ్గరకు వెళ్లారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు వెంటే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి వద్ద రాడ్, చాకు, ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా సమాచారం. పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.