Foods for Woman Health : మహిళలు ఫిట్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే-every women must consume these foods for her good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Woman Health : మహిళలు ఫిట్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే

Foods for Woman Health : మహిళలు ఫిట్‌గా ఉండాలంటే ఇవి తినాల్సిందే

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 06, 2022 08:48 AM IST

Foods for Woman Health : మగవారితో పోలిస్తే మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. వారు ఫిట్​గా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం ఉంటాయి. అయితే రెగ్యూలర్​గా కొన్ని ఆహారాలు తీసుకుంటే.. మహిళలు ఇన్ అండ్ అవుట్ హెల్తీగా, ఫిట్​గా ఉంటారు అంటున్నారు నిపుణులు.

ప్రతి మహిళ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
ప్రతి మహిళ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

Foods for Woman Health : ప్రతి స్త్రీ కుటుంబానికి వెన్నెముక లాంటిది. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉన్నప్పుడు ఆ కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది. కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మహిళలు తమ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మహిళలు సరిగా తినేలా చూసుకోవాల్సిన బాధ్యత మగవారిపై కూడా ఉంది. అయితే కుటుంబం కోసమో.. ఇతరులకోసమో కాకపోయినా.. తమ కోసం అయినా మహిళలు మంచి ఫుడ్ తీసుకోవాలి. తమ శరీరానికి చాలా పోషకాలు అవసరమని గుర్తించాలి. కాబట్టి మహిళలు తమ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. పోషకాహార నిపుణులు ప్రేక్షా పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.

ఐరన్

శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైనది. దీనివల్లే శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనిని పొందాలంటే రోజువారీ ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, విత్తనాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే ధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ B12

స్త్రీలలో మూడ్ స్వింగ్స్ అనేది పెద్ద సమస్య. మహిళలు మంచి మానసిక స్థితికోసం, మెదడు సరిగ్గా పనిచేయడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి విటమిన్ B12 అవసరం. మాంసం, చీజ్, పాలు, గుడ్లు, బాదం, పుట్టగొడుగులను తమ ఆహార జాబితాలో చేర్చుకోవాలి.

బయోటిన్

ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకోసం, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి బయోటిన్ అవసరం. అలాగే ఈ ఆహారం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అరటిపండ్లు, బ్రోకలీ, బాదం, తృణధాన్యాలు, బంగాళదుంపలు, గుడ్లు తినడం చాలా ముఖ్యం.

కాల్షియం

బచ్చలికూర, పాలు, టోఫు, చియా గింజలు, బాదం, సోయాబీన్స్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. స్త్రీలకు ఎముకలు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. ఆ కోణంలో ఈ ఆహారాలు చాలా ముఖ్యమైనవి.

మెగ్నీషియం

బ్రౌన్ రైస్, డార్క్ చాక్లెట్, బాదం, బచ్చలికూర, అరటిపండ్లు, స్క్వాష్ లేదా గుమ్మడికాయ తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లోపాన్ని పూరించవచ్చు. PMS లేదా మహిళల్లో రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

విటమిన్ డి

మీ రోజువారీ ఆహారంలో చేపలు, మాంసం, గుడ్లు, నారింజ, టోఫు తీసుకోండి. వీటిని ఆహారంలో ఉంచుకోవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు వస్తాయి. ఇది మెదడు, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇవి గుండెకు కూడా మంచివి. దంతాలు, నోటి ఆరోగ్యంపై కూడా సమర్థవంతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్