బ్రౌన్ రైస్‌తో ఎన్ని ప్రయోజనాలో.. ఈ వ్యాధులన్నీ దూరం చేసుకోవచ్చు!-amazing health benefits of brown rice know the beanfeasts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బ్రౌన్ రైస్‌తో ఎన్ని ప్రయోజనాలో.. ఈ వ్యాధులన్నీ దూరం చేసుకోవచ్చు!

బ్రౌన్ రైస్‌తో ఎన్ని ప్రయోజనాలో.. ఈ వ్యాధులన్నీ దూరం చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 05:22 PM IST

Health benefits of brown rice: బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్‌ క్యాన్సర్, బరువు పెరగడం, ఒళ్ళు నొప్పులు, మధుమేహం తదితర సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

<p>Health benefits of brown rice</p>
Health benefits of brown rice

Health benefits of brown rice: భారతీయలు ఎక్కువగా ఇష్టపడే ఆహారంలో రైస్ ఒకటి. రైస్‌లో అనేక రకాలుగా ఉన్నప్పటీకి చాలా మంది వైట్ రైస్‌ను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుత ఆరోగ్య కారణాల దృష్ట్యా డైటీషియన్లు వైట్ రైస్ (Brown Rice Benefits) బదులుగా బ్రౌన్ రైస్ తినమని సలహా ఇస్తున్నారు . తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ చాలా ప్రయోజనకరమైనదని అంటున్నారు. బ్రౌన్ రైస్ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు (Brown Rice Benefits) ఉన్నాయి . బ్రౌన్ రైస్ తినడం వల్ల క్యాన్సర్, బరువు పెరగడం, ఒళ్ళు నొప్పులు, మధుమేహం తదితర సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పాలిష్ చేయబడిన బియ్యం వల్ల శరీరానికి కావాల్పిన పోషకాలు అందవు. కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినాలి. ఈ బియ్యం శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి.

మధుమేహం సమస్యను తగ్గిస్తుంది

ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ఆహారం, శరీరక శ్రమపై దృష్టి ఉండడం లేదు. దీంతో మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఆహార శైలిని మార్చుకోవాలి. వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ సమస్యలు సర్వసాధారణం, కానీ శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వల్ల తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మలవిసర్జన ద్వారా కడుపులోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి బ్రౌన్ రైస్ తినాలని పోషకాహార నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు.

క్యాన్సర్ నివారణ

ప్రపంచంలో రికవరీ రెటు తక్కువగా ఉన్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ తీవ్రమైన వ్యాధి ఇప్పటి వరకు సమర్థవంతమైన నివారణ లేదు. క్యాన్సర్ నివారణ కోసం సరైన ఆహారపు అలవాట్లే పాటించాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డెంటల్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్లు చాలా మంది ఇబ్బంది పెడుతున్నాయి. వీటన్నింటిని నివారించడానికి మంచి ఆహారం చాలా ముఖ్యం. బ్రౌన్ రైస్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.

గుండె జబ్బులను నివారించడంలో

ఆరోగ్యవంతమైన జీవనానికి గుండె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇది గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు

Whats_app_banner

సంబంధిత కథనం