Iron Deficiency | ఇవి తినండి.. ఐరన్ లోపాన్ని జయించండి..-these food items you must take when your are suffering with iron deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iron Deficiency | ఇవి తినండి.. ఐరన్ లోపాన్ని జయించండి..

Iron Deficiency | ఇవి తినండి.. ఐరన్ లోపాన్ని జయించండి..

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 02:55 PM IST

ఐరన్​లోపం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. పిల్లల్లో, పెద్దల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఐరన్​లోపం ఉంటే.. తలనొప్ప, అలసట, మైకం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో మెడిసన్స్ తీసుకోవడంతో పాటు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హెల్తీ డైట్​ను పాటించాలంటున్నారు నిపుణులు.

<p>ఐరన్ లోపం</p>
ఐరన్ లోపం

ఐరన్ లోపం అనేది రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పోషకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. ఈ సమస్యతో బాధపడేవారు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 5 పదార్థాలను తినే ఆహారంలో చేర్చుకోండి.

ఎండుద్రాక్ష

ఐరన్ లోపాన్ని నివారించడానికి, లేదా తగ్గించుకోవడానికి ఎండుద్రాక్షాలు ఉపయోగపడతాయి. ఇది రుచికరమైన, మంచి పోషకాలు కలిగినది. మీరు ఏదైనా తినాలనుకున్నప్పుడు.. వాటిని ఎండుద్రాక్షలతో రిప్లేస్ చేయండి. ఆరోగ్యకరమైన చిరుతిండిని మీరు కూడా కాదనలేరు. రోజుకు 2-3 టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్ష తింటే సరిపోతుంది. అతిగా మాత్రం తినొద్దు.

డార్క్ చాక్లెట్

మీరు ఐరన్ సమస్యలను తీర్చుకోవాలనుకుంటే.. ఆహారంలో డార్క్ చాక్లెట్‌ని జోడించవచ్చు. డార్క్ చాక్లెట్​ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కాగలదని గుర్తుంచుకోండి. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్​లో ఇనుము, ఇతర అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా అవి కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇవి రెండు ముఖ్యమైన పోషకాలు. కాబట్టి ఐరన్ లేకపోవటం వల్ల రక్తహీనత ఉంటే, బీట్‌రూట్ సరైన నివారణ.

సీడ్స్

సీడ్స్ ఆరోగ్యకరమైనవని మనకు తెలుసు. గుమ్మడికాయ, చియా, ఫ్లాక్స్ వంటి విత్తనాలు ఇనుము, ఫోలేట్, జింక్‌ కలిగి ఉంటాయి. వీటిని సలాడ్‌లో చల్లడం, ఓట్‌మీల్‌తో కలపడం లేదా స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు.

బచ్చలికూర

బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు బచ్చలికూర తినవచ్చు. వీటి ద్వారా కేవలం ఐరన్ మాత్రమే కాదు.. విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం