Pumpkin Seeds: గర్భిణీలు గుమ్మడికాయ గింజలు తినకూడదా?-if you have these problems you should not eat pumpkin seeds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pumpkin Seeds: గర్భిణీలు గుమ్మడికాయ గింజలు తినకూడదా?

Pumpkin Seeds: గర్భిణీలు గుమ్మడికాయ గింజలు తినకూడదా?

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 05:07 PM IST

గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తినీ ఇస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్లు ఎ, సి, ఈ తోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుమ్మడికాయ విత్తనాలను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

<p>గుమ్మడి గింజలు</p>
<p>గుమ్మడి గింజలు</p> (pexels)

చాలా మంది గుమ్మడి కాయ గుజ్జు ఉంచుకొని గింజల్ని పక్కన పారేస్తుంటారు. అవునా? అయితే మీకు ఆ గింజల రహస్యం తెలియదనుకుంటా. వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని అస్సలు తినకూడదు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి గింజలను వీరు తినకూడదు..

* గుమ్మడికాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు. డాక్టర్ల సూచన మేరకే వీరు గుమ్మడి విత్తనాలను తీసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఇవి సమస్యలను కలగజేస్తాయి. కాబట్టి వారు ఈ విత్తనాలను తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

* గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ నిక్షేపాలు, రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధించవచ్చు. ఇది కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* డయాబెటిస్‌ ఉన్నవారిలో అయితే ఈ విత్తనాలు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించేందుకు సహాయ పడతాయి. అయితే రక్తంలో చక్కెర స్థాయి తక్కువ ఉన్నవారు ఈ విత్తనాలను తింటే షుగర్‌ లెవల్స్‌ మరింత పడిపోతాయి. దీంతో అపాయం కలుగుతుంది. కాబట్టి వీరు వీటిని తినరాదు.

* ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఈ విత్తనాలలో మంచి మోతాదులో ఉంటాయి. అంతేకాకుండా గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం లాంటి సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

* మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తినాల్సిందే.  ఇవి శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు పెరగకుండా ఆపుతుంది.

* గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. అయితే లో బీపీ సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే బీపీ ఇంకా తగ్గుతుంది. ఫలితంగా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు కూడా ఈ విత్తనాలను తినరాదు.

* గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అయితే ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తినరాదు. తింటే ఫైబర్‌ జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. కనుక వీటిని తక్కువగా తినాలి.

* గుమ్మడి గింజల నుంచి కావాల్సినంత ఫైబర్ లభిస్తుంది. వంద గ్రాముల గుమ్మడి గింజల నుంచి పద్ధెనిమిది గ్రాములు ఫైబర్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజుకి కావాల్సిన ఫైబర్ లో 72 శాతం ఉంటుంది.

* గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్‌లు రాకుండా కాపాడుతాయి.

సంబంధిత కథనం