Gang Rape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు క్రైమ్ సీన్ ఇదే.. వెల్లడించిన పోలీసులు
జూబ్లీహిల్స్ రేప్ కేసుపై చర్చ నడుస్తూనే ఉంది. అత్యాచార కేసును లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
అత్యాచార కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమవేశ నిర్వహించారు. ఈ కేసులో ఎక్కువగా మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని తెలిపారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడన్నారు. పార్టీ ఏర్పాటు చేయాలని ముగ్గురు స్నేహితులను సంప్రదించినట్టుగా వెల్లడించారు. ముగ్గురు పిల్లలు సర్వే చేసి అమ్నేషియా పబ్ బాగుంటుందని చెప్పారన్నారు. పార్టీ ఏర్పాటు విషయమై ఒక మైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడన్నారు. నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్‌తో పార్టీ కోసం పబ్‌లో బుక్ చేశారన్నారు.
కేసు విషయాలు సీపీ మాటల్లోనే..
ఓ స్నేహితుడి ద్వారా బెంగళూరు వ్యక్తి అమ్నేషియా పబ్ బుక్ చేయించారు. రూ.1200 టికెట్‌ను బేరమాడి రూ.900 ఉండేలా తగ్గించారు. మే రెండో వారంలో మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. పార్టీ కోసం టికెట్ రూ.900కు తగ్గించినా రూ.1200 వసూలు చేశారు. మే 25న బెంగళూరు నుంచి వచ్చి రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారు. మే 28న బాధితురాలు టికెట్ ధర చెల్లించి స్నేహితుడితో పబ్‌కు వచ్చింది. మే 28న పబ్‌లో బాలిక పట్ల ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించారు. పబ్ నుంచి బాలిక, ఆమె స్నేహితురాలు బయటకు వచ్చారు. బాలికతో ఉన్న ఆమె స్నేహితురాలు క్యాబ్‌లో వెళ్లిపోయింది.
నలుగురు నిందితులు బాలికతో పాటు కారులో ఎక్కారు. మరో నలుగురు నిందితులు మరో కారులో అనుసరించారు. కారులో వెళ్తుండగా బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రెండు కార్లు సాయంత్రం బేకరీ వద్దకు చేరుకున్నాయి. అనంతరం బాలిక మరో కారులో ఎక్కింది. సాయంత్రం 6.15 గంటలకు బాలికతో ఉన్న కారు అక్కడి నుంచి వెళ్లింది. బాలిక సహా ఏడుగురు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆరుగురు నిందితుల్లో ఒకరు వెనక్కి వచ్చారు. సాదుద్దీన్, మరో నలుగురు మైనర్లు బాలికను మరో చోటకు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో బాలికపై ఐదుగురు అత్యాచారం చేశారు.
రాత్రి 7.31 గం.కు పబ్ వద్ద బాలికను వదిలి వెళ్లిపోయారు. బాలిక ఫోన్ చేస్తే రాత్రి 7.53 గంటలకు తండ్రి వచ్చి తీసుకెళ్లాడు. మే 28న ఘటన జరిగినా మే 31 వరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలికపై గాయాలు గుర్తించి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మే 31న రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు జరిగింది. భరోసా కేంద్రంలో బాధితురాలికి ధైర్యం చెప్పడంతో వివరాలు చెప్పింది. బాధితారులు చెప్పిన వివరాల ప్రకారం కేసు సెక్షన్లు మార్చాం. నీలోఫర్ ఆస్పత్రిలో బాధితురాలిని చేర్పించి చికిత్స అందించాం. అత్యాచారం ఘటనలో సాదుద్దీన్ మాలిక్‌ను అరెస్టు చేశాం. ఘటనలో సాదుద్దీన్ మాలిక్, మరో నలుగురు మైనర్లను పట్టుకున్నాం. మరో నిందితుడిపైనా పలు సెక్షన్ల కింద కేసు పెట్టాం. పబ్, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం.
అత్యాచారం కేసులో ఏ-1 సాదుద్దీన్ మాలిక్ మాత్రమే మేజర్. అత్యాచారం కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్టు అయ్యారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైంది. కేసులో ఎవరినీ తప్పించే ఎలాంటి ప్రయత్నం జరగలేదు.
సంబంధిత కథనం
టాపిక్