తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bathukamma: ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్కఊరికిస్తె ఉయ్యాలో- పూల పండగకు వేళాయే

Bathukamma: ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్కఊరికిస్తె ఉయ్యాలో- పూల పండగకు వేళాయే

25 September 2022, 7:52 IST

    • bathukamma celebrations: బతుకమ్మ.... తెలంగాణ సంస్కృ తి వైభవానికి ప్రతీక. ఇది ఆడపడుచుల పండుగ. తీరొక్క పూలతో పేర్చి... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడ లు ఉయ్యాలో.. కలికి కామాక్షి ఉయ్యాలో.. అంటూ ఆడుతూ పాటలు పాడుతుంటారు. అలాంటి పూల పండగకు వేళైంది. ఇవాళ్టి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలుకానున్నాయి.
బతుకుమ్మ పండగ (ఫైల్ ఫొటో)
బతుకుమ్మ పండగ (ఫైల్ ఫొటో) (twitter)

బతుకుమ్మ పండగ (ఫైల్ ఫొటో)

Bathukamma Festival 2022:

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో

ఒక్కడే మాయన్న ఉయ్యాలో..ఒచ్చెన పొయెన ఉయ్యాలో

ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో..ఏరడ్డమాయె ఉయ్యాలో

ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో..తలుపులడ్డమాయె ఉయ్యాలో

తలుపు తాళాలు ఉయ్యాలో..వెండివే చీలలు ఉయ్యాలో

వెండి చీలకింది ఉయ్యాలో..వెలపత్తి చెట్టు ఉయ్యాలో

వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో..ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో....

...ఇలా ఇవాళ్టి నుంచి ప్రతి ఊరువాడ బతుకమ్మ పాటలతో మార్మోగనుంది. పట్నం, పల్లె అనే తేడా లేకుండా...ఏ ఇంట చూసిన పూల పండగ ఉత్సాహాంగా జరగనుంది. బతుకమ్మను బతుకునిచ్చే తల్లిగా తెలంగాణ మహిళలు కొలుస్తుంటారు. తెలంగాణ సంస్కృ తి వైభవానికి ప్రతీకగా... ఆడపడుచుల పండగగా బతుకమ్మకు పేరుంది. తీరొక్క పూలతో పేర్చి... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ కొలుస్తారు.

ప్రపంచలోనే పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉంటుంది. అందుకే ఈ పండగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక తెలంగాణ ఉద్యమంలోనూ 'బతుకమ్మ'కు ప్రత్యేక పేజీ ఉందనే చెప్పొచ్చు. నాడు ప్రతి పల్లెలోని మహిళలు బతుకమ్మలు ఎత్తి రాష్ట్ర ఆకాంక్షను చాటారు. సంస్కృతి ఉద్యమానికి ఈ వేడుకలు ఎంతో బలాన్ని చేకూర్చాయనే చెప్పొచ్చు. ఇక ఊర్లో ఉన్న చెరువు కట్ట దగ్గర నుంచి... లండన్ లోని థేమ్స్ నది వరకు కూడా బతుకమ్మ వేడుకలు జరిగాయంటే.... పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత... బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించింది ప్రభుత్వం. సర్కార్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ వేడుకలను ఘనంగా చేపడుతోంది.

బతుకమ్మ 2022 తేదీలు

1. ఆదివారం, సెప్టెంబర్ 25 ఎంగిలి పువ్వు బతుకమ్మ

2. సోమవారం, సెప్టెంబర్ 26 అటుకుల బతుకమ్మ

3. మంగళవారం, సెప్టెంబర్ 27 ముద్దపువ్వు / ముద్దపప్పు

4. బుధవారం, సెప్టెంబర్ 28 నానా బియ్యం

5. గురువారం, సెప్టెంబర్ 29 అట్ల బతుకమ్మ

6. శుక్రవారం, సెప్టెంబర్ 30 అలిగిన / అర్రెము / అలక

7. శనివారం, అక్టోబర్ 1 వేపకాయల బతుకమ్మ

8. ఆదివారం, అక్టోబర్ 2 వెన్నె ముద్దల బతుకమ్మ

9. సోమవారం, అక్టోబర్ 3 సద్దుల బతుకమ్మ (చద్దుల బతుకమ్మ)

రాష్ట్ర పండుగ బతుకమ్మకు సంబరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ప్రత్యేకంగా రూ. 10 కోట్లను కేటాయించింది. నేటి నుంచి అక్టోబర్ 3వ తేదీ వర కు తొమ్మిది రోజలు పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆశ్వయుజ అమావాస్య (ఆదివారం) నాడు ఎంగిలి పూలు పేరుతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. నిమజ్జనం కోసం చెరువులు, కుంటలు, బావుల వద్ద దగదగలాడే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ వేడుకలు జరుగుతుండడం విశేషం.

టాపిక్