Bathukamma Names 2022 : ఒక్కోరోజు బతుకమ్మకు ఒక్కోపేరు ఉంటుంది.. అవేంటో తెలుసా?
Bathukamma Names 2022 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. తమ సంస్కృతిని బహిర్గతం చేసే పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో బతుకుమ్మ ఒకటి. ఈ సమయంలో ప్రతిచోట పూలు, మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. తొమ్మిది రోజులు సాగే ఈ పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పటివరకు కొనసాగుతుందో వంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bathukamma Names 2022 : బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలు జరుపుకునే పూల పండుగ (తెలంగాణ సాంస్కృతిక పండుగ). ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ తరువాత.. ఇది భాద్రపద అమావాస్యకు రెండు రోజుల ముందు చేసుకుంటారు. బతుకమ్మ వర్ష రుతు (వర్షాకాలం) ముగింపును సూచిస్తుంది. అయితే బతుకమ్మ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, బతుకమ్మ తేదీలు.. బతుకమ్మల పేర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* బతుకమ్మ అనేది ఒక అందమైన పూల స్టాక్‌గా చెప్పవచ్చు. వివిధ కాలానుగుణ పూలతో కేంద్రీకృత పొరలలో బతుకమ్మను అమర్చుతారు. ఇవన్నీ ఔషధ & అడవి పువ్వులు. ఈ తొమ్మిది రోజులు గౌరీ దేవిని బతుకమ్మ రూపంలో మహిళలు పూజిస్తారు.
* పండుగ చివరి రోజు ఆశ్వయుజ అష్టమి తిథిని జరుపుకుంటారు. ఆ రోజునే దుర్గాష్టమి అంటారు.
* దుర్గాష్టమి తర్వాత రెండవ రోజు అంటే ఆశ్వయుజ దశమి (ఆశ్వయుజ మాసంలో పదవ రోజు) నాడు దసరా జరుపుకుంటారు. దీనిని విజయ దశమి అంటారు.
* మహిళలు తొమ్మిది రోజులూ సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ చుట్టూ ఆడుతూ, పాడుతూ పండుగను జరుపుకుంటారు.
* బతుకమ్మ పాటలు అత్యంత ప్రజాదరణ పొందిన పాటలుగా చెప్పవచ్చు.
* ఈ పూల పండుగను అమావాస్య క్యాలెండర్ ప్రకారం భాద్రపద అమావాస్య రోజున ప్రారంభిస్తారు. తెలంగాణలో ఈ రోజును పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు.
* ఇది శరత్ రుతు (శరదృతువు సీజన్) ప్రారంభాన్ని సూచిస్తుంది.
బతుకమ్మ 2022 తేదీలు
2022లో బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 25 (భాద్రపద అమావాస్య)న ప్రారంభమై అక్టోబర్ 3 (ఆశ్వయుజ అష్టమి) దుర్గా అష్టమితో చద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. పైగా ఒక్కోరోజు బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజు తేదీ బతుకమ్మ పేరు
1. ఆదివారం, సెప్టెంబర్ 25 ఎంగిలి పువ్వు బతుకమ్మ
2. సోమవారం, సెప్టెంబర్ 26 అటుకుల బతుకమ్మ
3. మంగళవారం, సెప్టెంబర్ 27 ముద్దపువ్వు / ముద్దపప్పు
4. బుధవారం, సెప్టెంబర్ 28 నానా బియ్యం
5. గురువారం, సెప్టెంబర్ 29 అట్ల బతుకమ్మ
6. శుక్రవారం, సెప్టెంబర్ 30 అలిగిన / అర్రెము / అలక
7. శనివారం, అక్టోబర్ 1 వేపకాయల బతుకమ్మ
8. ఆదివారం, అక్టోబర్ 2 వెన్నె ముద్దల బతుకమ్మ
9. సోమవారం, అక్టోబర్ 3 సద్దుల బతుకమ్మ (చద్దుల బతుకమ్మ)
సంబంధిత కథనం