తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final 2023 : గందరగోళంలో రోహిత్ శర్మ.. ఇప్పుడు ఏం చేయాలి?

WTC Final 2023 : గందరగోళంలో రోహిత్ శర్మ.. ఇప్పుడు ఏం చేయాలి?

Anand Sai HT Telugu

06 June 2023, 12:09 IST

    • WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చివరి మ్యాచ్‌ దగ్గర పడింది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త గందరగోళంలో ఉన్నాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్ లో గెలిచేందుకు టీమిండియా చూస్తోంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Twitter)

రోహిత్ శర్మ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో తలపడేందుకు టీమిండియా, ఆస్ట్రేలియా(IND Vs AUS) జట్లు సిద్ధమయ్యాయి. గత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఛాంపియన్‌ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఇప్పుడు చాలా వ్యూహాలు కూడా సిద్ధమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ఈ దశలో టీం ఇండియా ఆడే జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పెద్ద గందరగోళంలో పడ్డాడు. ఓ రెండు స్థానాలు టీమిండియా కెప్టెన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. గత ఫైనల్లో ఎదురైన ఎదురుదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే కెప్టెన్ ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే.

టీమ్ ఇండియా కెప్టెన్‌ను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్నలలో వికెట్ కీపర్ ఎంపిక ఒకటి. రిషబ్ పంత్ గైర్హాజరీలో కేఎస్ భరత్(KS Barath) ఫస్ట్ ఛాయిస్ అయినప్పటికీ.. బ్యాటింగ్ లో భారత్ రాణించలేకపోయింది. అందువలన ఇది గందరగోళంగా ఉంది. ఇషాన్ కిషన్ కు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ కిషన్(Ishan Kishan)ను నేరుగా ఇంత పెద్ద వేదికపై ఆడించడం పట్ల కెప్టెన్ కూడా ఆందోళన చెందుతున్నాడు. రిషబ్ పంత్‌లా బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు ఇషాన్ కిషన్ కావడంతో ఇషాన్‌కు అనుకూలంగానే చర్చ జరుగుతోంది. అందుకే ఈ విషయంలో నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎంత మంది పేసర్లను రంగంలోకి దించాలనేది ప్రశ్న. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలా లేక ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లతో ఆడాలా అనేది ప్రశ్న. అంటే ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఆర్ అశ్విన్, ఉమేష్ యాదవ్‌లలో ఒకరికి మాత్రమే ఆడే జట్టులో అవకాశం దక్కుతుంది. ఇది కూడా రోహిత్ ను ఆలోచనల్లో పడేసింది.

ఈ విషయంలో ఆల్ రౌండర్ పేసర్ లేకపోవడం జట్టును నిజంగా ఇబ్బంది పెడుతోంది. ఇంగ్లండ్ బౌన్సీ పిచ్ లపై ఫాస్ట్ బౌలింగ్(Fast Bowling) విభాగం పాత్ర కీలకం కానుంది. జట్టులోని బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల మధ్య మ్యాచ్ చేయడానికి మిడిల్ ఆర్డర్‌లో ఫాస్ట్ బౌలర్ పాత్ర ముఖ్యమైనది. అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ విభాగం బలాన్ని కూడా పెంచడం గమనార్హం. ఈ లెక్కలన్నీ చూస్తుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్‌మెంట్ నిర్ణయంపై కాస్త ఆసక్తికరంగానే ఉంది.

టాపిక్