Test Cricket Sixes : టెస్టు క్రికెట్‌లో టీమిండియా సిక్సర్ కింగ్స్ ఎవరో తెలుసా?
WTC Final 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు టైమ్ దగ్గరపడింది. జూన్ 7న ఫైనల్ పోరు జరగనుంది. అయితే టెస్టుల్లో ఎక్కువ సిక్సర్స్ కొట్టిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
WTC Final 2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బుధవారం (జూన్ 7) నుండి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించగలడు. కాబట్టి ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ నుంచి ప్రత్యేక రికార్డును ఆశించవచ్చు.
టీమిండియా(Team India) తరఫున మొత్తం 329 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్(Sachi Tendulkar) మొత్తం 69 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం 83 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కావాలి. కాబట్టి ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ నుంచి ప్రత్యేక రికార్డును ఆశించవచ్చు.
టెస్టు క్రికెట్(Test Cricket)లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టుల్లో 91 సిక్సర్లు కొట్టి వీరూ రికార్డు సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కూడా 2వ స్థానంలో ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు.
329 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ(Rohit Sharma) 4వ స్థానంలో ఉన్నాడు. 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ సచిన్ రికార్డను బ్రేక్ చేసేందుకు దగ్గరలో ఉన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)లో ఆడేందుకు ప్రస్తుతం లండన్‌లోని ఓవల్ మైదానంలో టీమ్ ఇండియా చివరి దశ ప్రాక్టీస్ నిర్వహిస్తుండడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది.
టీమ్ ఇండియా జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
సంబంధిత కథనం