తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Steve Smith On Team India : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాను హెచ్చరించిన స్టీవ్ స్మిత్

Steve Smith On Team India : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాను హెచ్చరించిన స్టీవ్ స్మిత్

Anand Sai HT Telugu

06 June 2023, 9:27 IST

    • WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత జట్టును హెచ్చరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు పెరిగాయని అన్నాడు. అయితే, భారత పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్‌లపై ప్రశంసలు కురిపించాడు.
స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్ (twitter)

స్టీవ్ స్మిత్

డబ్ల్యూటీసీ ఫైనల్‌(WTC Final) మ్యాచ్ కు సమయం దగ్గర పడింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా(IND Vs AUS) పోటీ పడనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టీవ్ స్మిత్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత పేసర్లపై ప్రశంసలు కురిపించాడు. షమీ, సిరాజ్‌లకు డ్యూక్ బాల్ సరైనదని తెలిపాడు. భారత జట్టుకు మంచి బౌలింగ్‌ అటాక్‌ ఉందని కొనియాడాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

'భారత జట్టుకు మంచి ఫాస్ట్ బౌలింగ్ బలం ఉంది. ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను బద్దలు కొట్టగల సామర్థ్యం ఉంది. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత, భారత్ రెండోసారి ఫైనల్‌లోకి ప్రవేశించి విజయంపై నమ్మకంతో ఉంది. భారత్‌ను ఓడించగలం.. రెండేళ్లు బాగా ఆడాం.. అందుకే ఫైనల్‌కు చేరుకున్నాం.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్ధమయ్యాం.' అని స్టీవ్ స్మిత్ అన్నాడు.

భారత జట్టులో పేసర్లే కాదు, స్పిన్ బౌలింగ్(Spin Bowling) కూడా బాగానే ఉందని చెప్పాడు స్టీవ్ స్మిత్. వారికి అన్ని పరిస్థితుల్లోనూ బాగా బౌలింగ్ చేసిన అనుభవం ఉందన్నాడు. 'భారత్ బౌలింగ్ బాగుందని నేను భావిస్తున్నాను. వారిపై మనం బాగా ఆడాలి. పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇంకా పిచ్ చూడలేదు, దాని గురించి పెద్దగా చెప్పలేను. ఇది వేసవి కాబట్టి పిచ్ కొంచెం పొడిగా ఉంటుంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్ బౌలింగ్ సహాయం పొందవచ్చు.' అని పేర్కొన్నాడు.

భారత్ ముగ్గురు పేసర్లను రంగంలోకి దించే అవకాశం ఉంది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లు తొలి రెండు ఎంపికలు కాగా శార్దూల్ ఠాకూర్ మూడో పేసర్‌గా నిలిచే అవకాశం ఉంది. స్పిన్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు ఆడనుండగా, అశ్విన్‌కు బదులుగా ఉమేష్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది.