Wasim Jaffer on Smith: కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసి ఔటయ్యారు.. స్టీవ్ స్మిత్‌, లబుషేన్‌లపై జాఫర్ పంచ్-wasim jaffer on smith and labuschagne says they practiced together and got out together ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Jaffer On Smith: కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసి ఔటయ్యారు.. స్టీవ్ స్మిత్‌, లబుషేన్‌లపై జాఫర్ పంచ్

Wasim Jaffer on Smith: కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసి ఔటయ్యారు.. స్టీవ్ స్మిత్‌, లబుషేన్‌లపై జాఫర్ పంచ్

Hari Prasad S HT Telugu
Feb 17, 2023 05:05 PM IST

Wasim Jaffer on Smith: కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసి ఔటయ్యారు అంటూ ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్‌, లబుషేన్‌లపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పంచ్ వేశాడు.

డకౌటైన తర్వాత నిరాశగా వెనుదిరుగుతున్న స్టీవ్ స్మిత్
డకౌటైన తర్వాత నిరాశగా వెనుదిరుగుతున్న స్టీవ్ స్మిత్ (AFP)

Wasim Jaffer on Smith: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, లబుషేన్ లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో లబుషేన్ 18 రన్స్ చేయగా.. స్మిత్ డకౌటయ్యాడు. అశ్విన్ మూడు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ చేసి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. టెస్టుల్లో స్మిత్ ను రెండుసార్లు డకౌట్ చేసి తొలి బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు.

అయితే ఈ ఇద్దరూ ఇలా ఔటవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పంచ్ వేశాడు. ఇద్దరూ నెట్స్ లో కలిసి ప్రాక్టీస్ చేశారని, ఇప్పుడు ఇద్దరూ కలిసే ఔటయ్యారని ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేయడం విశేషం. 23వ ఓవర్ నాలుగో బంతికి లబుషేన్ ఔటవగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు.

నిజానికి అశ్విన్ ను సమర్థంగా ఎదుర్కోవడానికే ఆస్ట్రేలియా టీమ్ బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లు ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేసింది. అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియాను రప్పించింది. ముఖ్యంగా అతని బౌలింగ్ లో స్మిత్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. అయినా అశ్విన్ ను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

స్మిత్ తోపాటు లబుషేన్ లపైనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఓపెనర్లు వార్నర్, ఖవాజాలు కూడా మంచి బ్యాటర్లే అయినా.. ఇండియాలోని స్పిన్ పిచ్ లపై వీళ్లే సమర్థంగా ఆడతారని అంచనా వేశారు. కానీ తొలి రెండు టెస్టుల్లో ఈ ఇద్దరూ నిరాశ పరిచారు. దీంతో వాళ్లను ఉద్దేశించి జాఫర్ ఇలా కౌంటర్ వేయడం విశేషం. ఏ బౌలర్ ను చూసి వాళ్లు ఇన్నాళ్లూ భయపడుతున్నారో అదే బౌలర్ కు తమ వికెట్లు సమర్పించుకున్నారు.

ఇక లబుషేన్ వికెట్ తీసిన తర్వాత అశ్విన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 700 వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. షమి 4, జడేజా 3 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 263 పరుగులకే ఆలౌటైంది.

WhatsApp channel