Rohit vs Naveen: ఫ్యాన్స్ కోహ్లి కోహ్లి అని అరుస్తుంటే.. నవీన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రోహిత్-rohit vs naveen as mi captain hit lsg bowler to a six while fans chat kohli name ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Vs Naveen: ఫ్యాన్స్ కోహ్లి కోహ్లి అని అరుస్తుంటే.. నవీన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రోహిత్

Rohit vs Naveen: ఫ్యాన్స్ కోహ్లి కోహ్లి అని అరుస్తుంటే.. నవీన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రోహిత్

Hari Prasad S HT Telugu
May 17, 2023 08:48 AM IST

Rohit vs Naveen: ఫ్యాన్స్ కోహ్లి కోహ్లి అని అరుస్తుంటే.. నవీన్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు రోహిత్ శర్మ. ఈ వీడియో టీమిండియా అభిమానులకు తెగ నచ్చేసింది. విరాట్ ప్రతీకారం రోహిత్ తీర్చుకున్నాడంటూ సంబరపడిపోతున్నారు.

నవీనుల్ బౌలింగ్ లో సిక్స్ కొడుతున్న రోహిత్ శర్మ
నవీనుల్ బౌలింగ్ లో సిక్స్ కొడుతున్న రోహిత్ శర్మ

Rohit vs Naveen: విరాట్ కోహ్లి ప్రతీకారం రోహిత్ శర్మ తీర్చుకున్నాడా? లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో నవీనుల్ హక్ బౌలింగ్ లో ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ చూసి అభిమానులు అలాగే అనుకుంటున్నారు. ఆర్సీబీతో మ్యాచ్ లో కోహ్లితో గొడవపడి తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతన్ని రెచ్చిగొడుతూ వచ్చిన నవీనుల్ హక్ ను ఎంఐ బ్యాటర్లు ఆడుకున్నారు.

ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు బాదారు. దీంతో అతడు లక్నో కొంప ముంచినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ చివరి ఓవర్లో మోసిన్ ఖాన్ మ్యాజిక్.. నవీనుల్ ను విమర్శల నుంచి రక్షించింది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లి అభిమానులను తెగ సంతోషపెట్టే సీన్ ఒకటి ఉంది. అది నవీన్ బౌలింగ్ లో రోహిత్ సిక్స్ కొట్టడం.

నవీన్ బౌలింగ్ కు దిగగానే లక్నో స్టేడియం మొత్తం కోహ్లి నినాదాలతో మార్మోగిపోయింది. వాళ్లు కోహ్లి కోహ్లి అని అరుస్తుండగా.. నవీనుల్ వేసిన ఓ బంతిని రోహిత్ సిక్స్ గా మలిచాడు. అది చూసి ఫ్యాన్స్ మరింత గట్టిగా కోహ్లి నామస్మరణ చేశారు. నిజానికి కోహ్లితో గొడవ తర్వాత నవీనుల్ హక్ మళ్లీ ఇప్పుడే ఫీల్డ్ లో కనిపించాడు. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత సీఎస్కేతో ఆడే అవకాశం నవీనుల్ కు దక్కినా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో అతడు బౌలింగ్ చేయలేకపోయాడు.

ఇప్పుడు ఎంఐతో మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా కొత్త బంతిని అతనికే ఇచ్చాడు. నవీనుల్ పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు. రోహిత్ ఓ సిక్స్, ఇషాన్ ఫోర్ కొట్టారు. అయితే నవీనుల్ ఎప్పుడు బౌలింగ్ కు దిగినా.. స్టేడియంలోని అభిమానులు కోహ్లి కోహ్లి అంటూ అరవడం కనిపించింది.

అలా అరుస్తున్న సమయంలోనే నవీనుల్ వేసిన ఓ స్లో బాల్ ను స్క్వేర్ లెగ్ దిశగా రోహిత్ సిక్స్ కొట్టాడు. ఇదే మ్యాచ్ లో 16వ ఓవర్లో మరోసారి బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. అయితే 19వ ఓవర్లో మాత్రం టిమ్ డేవిడ్ రెండు సిక్స్ లు బాదడంతో నవీనుల్ 19 పరుగులు సమర్పించుకున్నాడు. చివరికి లక్నోనే విజయం సాధించడంతో నవీనుల్ ఊపిరి పీల్చుకున్నాడు.

సంబంధిత కథనం