Ind vs SL | ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌.. లంకను చిత్తు చేసిన తర్వాత టీమిండియా స్థానమెక్కడ?-team india one place up in icc world test championship rankings after thrashing sri lanka ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sl | ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌.. లంకను చిత్తు చేసిన తర్వాత టీమిండియా స్థానమెక్కడ?

Ind vs SL | ఐసీసీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌.. లంకను చిత్తు చేసిన తర్వాత టీమిండియా స్థానమెక్కడ?

Hari Prasad S HT Telugu
Mar 15, 2022 06:50 AM IST

Ind vs SL | సౌతాఫ్రికాలో దారుణ పరాజయం తర్వాత టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో వెనుకబడిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంకను సొంతగడ్డపై చిత్తు చేసి కాస్త మెరుగైన స్థానంలోకి దూసుకెళ్లింది.

శ్రీలంకను చిత్తు చేసిన తర్వాత ట్రోఫీతో పంత్, రోహిత్, అశ్విన్, అక్షర్
శ్రీలంకను చిత్తు చేసిన తర్వాత ట్రోఫీతో పంత్, రోహిత్, అశ్విన్, అక్షర్ (PTI)

బెంగళూరు: ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో గతేడాది టీమిండియా రన్నరప్‌. నిజానికి తొలి ఛాంపియన్‌షిప్‌లో మొదటి నుంచీ దాదాపు టాప్‌లోనే ఉంది. అయితే రెండో ఛాంపియన్‌షిప్‌లో మాత్రం వెనుకబడిపోయింది. సౌతాఫ్రికాలో సిరీస్‌ ఓటమి తర్వాత ఐదోస్థానానికి దిగిజారింది. ఇప్పుడు శ్రీలంకను సొంతగడ్డపై చిత్తు చేసి ఒక స్థానం ఎగబాకింది. 

ప్రస్తుతం ఈ టేబుల్లో టీమిండియా నాలుగో స్థానానికి చేరుకుంది. రెండో టెస్ట్‌లో 238 పరుగుల భారీ తేడాతో గెలిచిన రోహిత్‌ సేన.. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ ద్వారా టీమ్‌కు 12 పాయింట్లు లభించాయి. 58.33 పర్సెంటేజ్‌తో శ్రీలంకను వెనక్కి నెట్టి నాలుగోస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా (77.77%), పాకిస్థాన్‌ (66.66%), సౌతాఫ్రికా (60.00%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక టీమిండియా తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ ఉన్నాయి.

ఈ రెండో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియన్‌ టీమ్‌ ఇప్పటి వరకూ 4 సిరీస్‌లు ఆడింది. అందులో ఆరు టెస్టులు గెలిచి, మూడింట్లో ఓడిపోయి, మరో రెండు డ్రా చేసుకుంది. గతేడాది ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లిన టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఐదో టెస్ట్‌ ఆడకుండానే తిరిగి వచ్చేసింది. ఆ మ్యాచ్‌, సిరీస్‌పై ఇంకా ఎటూ తేలలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్