తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup Pakistan Team: టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్‌ టీమ్‌ ఇదే.. అఫ్రిదికి చోటు

T20 World Cup Pakistan Team: టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్‌ టీమ్‌ ఇదే.. అఫ్రిదికి చోటు

Hari Prasad S HT Telugu

15 September 2022, 18:05 IST

    • T20 World Cup Pakistan Team: టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్‌ టీమ్‌ను ఎంపిక చేసింది అక్కడి క్రికెట్‌ బోర్డు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు అక్కడి బోర్డు వరల్డ్‌కప్‌ టీమ్‌ను ఎంపిక చేసింది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (AP)

పాకిస్థాన్ క్రికెట్ టీమ్

T20 World Cup Pakistan Team: ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ టీమ్‌ ఇక టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీ కోసం గురువారం (సెప్టెంబర్‌ 15) టీమ్‌ను ప్రకటించారు. అక్టోబర్‌ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23న సూపర్‌ 12 స్టేజ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను ఇండియాతో పాక్‌ ఆడనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను పాక్‌ అనౌన్స్‌ చేసింది. ఈ టీమ్‌లోకి పేస్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది తిరిగి వచ్చాడు. గాయం కారణంగా అతడు ఆసియా కప్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ టీమ్‌లో పెద్ద సంచలనాలు ఏమీ లేవు. అయితే ఆసియాకప్‌లో విఫలమైన ఫకర్‌ జమాన్‌ను రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉంచగా.. టీమ్‌లోకి షాన్‌ మసూద్‌ను ఎంపిక చేసింది.

అయితే ఈ వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి సీనియర్‌ ప్లేయర్స్‌ షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లలో ఒకరు తిరిగి వస్తారని అక్కడి మీడియాలో అంచనా వేసినా.. సెలక్టర్లు మాత్రం వీళ్లకు అవకాశం ఇవ్వలేదు. ఇక చాలా వరకూ ఆసియాకప్‌లో ఆడిన టీమ్‌నే కొనసాగించారు. యువ సంచలనం నసీమ్‌ షాను వరల్డ్‌ కప్‌ టీమ్‌కు కూడా ఎంపిక చేశారు.

ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ఇప్పటికీ పాకిస్థాన్ టీమ్ పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఓటమిపై స్పందిస్తూ.. ఇది సిగ్గుచేటని, మీ జాతీయవాదం ఎక్కడికెళ్లిందని ప్రశ్నించాడు.

టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్‌ టీమ్‌ ఇదే

బాబర్‌ ఆజం (కెప్టెన్‌), షాదాబ్‌ ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్‌ అలీ, హైదర్‌ అలీ, హరీస్‌ రవూఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షా, షహీన్‌ షా అఫ్రిది, షాన్‌ మసూద్‌, ఉస్మాన్‌ ఖాదిర్‌

రిజర్వ్‌ ప్లేయర్స్‌: ఫకర్‌ జమాన్‌, మహ్మద్‌ హరీస్, షానవాజ్‌ దహానీ