తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sarfaraz On Bradman Comparison: బ్రాడ్‌మన్‌తో పోలిక చాలా ఆనందంగా ఉంది: సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz on Bradman Comparison: బ్రాడ్‌మన్‌తో పోలిక చాలా ఆనందంగా ఉంది: సర్ఫరాజ్ ఖాన్

Hari Prasad S HT Telugu

18 January 2023, 16:05 IST

  • Sarfaraz on Bradman comparison: బ్రాడ్‌మన్‌తో పోలిక చాలా ఆనందంగా ఉందని అన్నాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న సర్ఫరాజ్ డాన్ సగటుకు సమీపంలోకి వెళ్లడం గర్వంగా ఉందని చెప్పాడు.

సర్ఫరాజ్ ఖాన్
సర్ఫరాజ్ ఖాన్ (PTI)

సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz on Bradman comparison: ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది రంజీల్లో ఆరు మ్యాచ్‌లలో 111.20 సగటుతో 556 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక గత రంజీ సీజన్ చూస్తే అతడు ఆరు మ్యాచ్‌లలో 982 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అతని సగటు 122.75 కాగా, అందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ స్థాయిలో రాణించినా అతన్ని నేషనల్ టీమ్ లోకి మాత్రం తీసుకోలేదు. ఈ మధ్యే ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్ లో సర్ఫరాజ్ ఉంటాడని అందరూ భావించినా.. సెలక్టర్లు అతన్ని కరుణించలేదు. దీనిపై సర్ఫరాజ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ సగటు 80.47గా ఉంది. ఇది ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధికం కావడం గమనార్హం. ఈ రికార్డునే గుర్తు చేస్తూ సర్ఫరాజ్ తనను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బ్రాడ్‌మన్ సగటుకు దగ్గరగా ఉండటం ఎలా అనిపిస్తోందని ప్రశ్నించగా.. సర్ఫరాజ్ స్పందించాడు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రాడ్‌మన్ కు సమంగా ఎవరూ వెళ్లలేరు. కానీ అతని దగ్గరగా వెళ్లినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. రికార్డులది ఏముంది. ఒకసారి వస్తాయి. మరోసారి కోల్పోతాము. సగటు ఓసారి ఎక్కువగా ఉంటుంది. మరోసారి పడిపోతుంది. కానీ నేను ఎప్పుడూ బాగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాను" అని సర్ఫరాజ్ అన్నాడు.

తన జీవితంలో ప్రత్యేకంగా లక్ష్యాలేవీ లేవని కూడా స్పష్టం చేశాడు. "నా జీవితంలో గోల్స్ ఏమీ లేవు. ప్రతి మ్యాచ్ లో రన్స్ చేయడం, నేను ప్రాక్టీస్ చేసినదానిని సరిగ్గా అమలు చేయడమే నా టార్గెట్" అని సర్ఫరాజ్ స్పష్టం చేశాడు. నేషనల్ టీమ్ లోకి ఎంపిక కాకపోయినా.. తాను ప్రయత్నిస్తూనే ఉంటానని, డిప్రెషన్ లోకి మాత్రం వెళ్లనని గతంలో సర్ఫరాజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

టాపిక్