Gilchrist to Australia Team: ఇండియాను ఓడించాలంటే ఇలా చేయండి: ఆస్ట్రేలియాకు గిల్‌క్రిస్ట్‌ సూచన-gilchrist to australia team says swallow your pride a bit to beat india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gilchrist To Australia Team Says Swallow Your Pride A Bit To Beat India

Gilchrist to Australia Team: ఇండియాను ఓడించాలంటే ఇలా చేయండి: ఆస్ట్రేలియాకు గిల్‌క్రిస్ట్‌ సూచన

Hari Prasad S HT Telugu
Jan 17, 2023 04:13 PM IST

Gilchrist to Australia Team: ఇండియాను ఓడించాలంటే ఇలా చేయండంటూ ఆస్ట్రేలియాకు మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కీలక సూచన చేశాడు. ఇండియాతో ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (AFP)

Gilchrist to Australia Team: ఆస్ట్రేలియా టీమ్ ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దాల పాటు ఏలింది. ప్రపంచాన్నంతా జయించింది. అయితే ఇండియాలో మాత్రం ఆ టీమ్ ఆధిపత్యం చెలాయించలేకపోయింది. అప్పుడెప్పుడో 2004లో చివరిసారి ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టీమ్‌ టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. అయితే ఇప్పుడు ప్యాట్‌ కమిన్స్‌ కెప్టెన్సీలోని టీమ్‌ చరిత్రను పునరావృతం చేయస్తుందన్న ఆశతో ఉన్నాడు అప్పటి కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌.

ట్రెండింగ్ వార్తలు

అలా జరగాలంటే ఏం చేయాలన్న సూచన కూడా చేశాడు. కొత్త ముఖాలతో ప్రయోగాలు చేసే కంటే.. ఇండియన్‌ కండిషన్స్‌లో అనుభవజ్ఞులైన బౌలర్లకే అవకాశం ఇవ్వాలన్నది గిల్లీ సూచన. మిస్టరీ బౌలర్లు అంటూ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే అది ఎదురు తన్నే ప్రమాదం ఉన్నట్లు కూడా చెప్పాడు. ఫాక్స్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతడు.. కమిన్స్‌ సేనకు కొన్ని కీలకమైన సూచనలు చేశాడు.

"మేము అప్పుడు చేసిందే ఇప్పటి ఆస్ట్రేలియా టీమ్‌ చేస్తుందని నేను భావిస్తున్నాను. అదేంటంటే.. వెతికి మరీ కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్‌ చేయించకూడదు" అని గిల్‌క్రిస్ట్‌ చెప్పాడు. "తొలి బంతి నుంచే స్టంప్స్‌ను అటాక్‌ చేయండి. మీ గొప్పలు కాసేపు పక్కన పెట్టండి.

రక్షణాత్మకంగా ఉండండి. ఆ తర్వాత దూకుడు పెంచొచ్చు. ఒక స్లిప్‌, క్యాచింగ్‌ మిడ్‌ వికెట్‌తో ప్రారంభించండి. బౌండరీల దగ్గర కూడా ఫీల్డర్లను పెట్టి బౌండరీలు రాకుండా చూడండి. షార్ట్‌ మిడ్‌ వికెట్‌ లేదా షార్ట్‌ కవర్‌లో ఫీల్డర్లను పెట్టండి. కాస్త సహనంతో ఉండండి" అని గిల్‌క్రిస్ట్ సూచించాడు.

ముగ్గురు పేస్‌ బౌలర్లు, నేథన్‌ లయన్‌ రూపంలో ఒక స్పిన్నర్‌ను తీసుకుంటే ఈసారి ఇండియాకు షాకివ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. "వాళ్లు సిరీస్‌ గెలుస్తారని అనుకుంటున్నా. వాళ్లకు అలాంటి టీమ్‌ ఉంది. 2004లోని మా టీమ్‌తో చాలా పోలికలు ఇప్పటి తుది జట్టుకు ఉన్నాయి. చాలాసార్లు ఓ కొత్త స్పిన్నర్‌ను తీసుకెళ్లి ఇండియాలో ప్రయోగించాలని చూస్తాం.

కానీ అది పని చేయదు. మీ బెస్ట్‌ నలుగురు బౌలర్లను తీసుకోండి. రివర్స్‌ స్వింగ్‌ చేయగలిగే ముగ్గురు సీమర్లు, నేథన్‌ లయన్‌ రూపంలో ఓ స్పిన్నర్‌ను తీసుకోండి. ఇలా చేస్తే మీరు కచ్చితంగా సక్సెస్‌ అవుతారన్నది నా కచ్చితమైన అంచనా" అని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు.

19 ఏళ్లుగా భారత గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ గెలవలేకపోయింది ఆస్ట్రేలియా. పైగా ఈ మధ్య కాలంలో వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియా గడ్డపై కూడా టీమిండియా సిరీస్‌లు గెలిచి వచ్చింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఇండియానే ఫేవరెట్‌గా దిగుతోంది. పైగా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ రేసులో ఈ రెండు టీమ్సే ముందున్నాయి. ఆస్ట్రేలియా ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖాయం కాగా.. ఈ సిరీస్‌ గెలిస్తే ఇండియా కూడా ఫైనల్‌ చేరుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం