Australia Squad for India Tour: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి జరగనున్న ఈ టెస్టు సిరీస్ కోసం కంగారూ జట్టు భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆడనున్న ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. 18 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్లకు ఎక్కువగా అవకాశం కల్పించింది. నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.
ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్‌తో పాటు టాడ్ మర్ఫీ, మిచెల్ స్వెప్ సన్, ఆష్టన్ అగర్ జట్టులోకి తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. 2019 జనవరి తర్వాత తొలిసారిగా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కంబ్‌ను పిలుపిచ్చింది. అతడితో పాటు మ్యాట్ రెన్షా రిజర్వ్ బ్యాటర్ల జాబితాలో ఉన్నాడు. మార్కస్ హ్యాన్రిస్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.
నాగ్‌పుర్‌లో జరిగే మొదటి టెస్టు మ్యాచ్ తర్వాత మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉంటాడు కాబట్టి అన్‌క్యాప్డ్ ప్లేయర్ ల్యాన్స్ మోరిస్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత్‌లో అతడు టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా దక్షిణాప్రికాతో పాటు ఓపెనింగ్ టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముంది. దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అతడు గాయపడిన విషయం తెలిసిందే.
ఈ పర్యటనకు యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని తీసుకోవడంపై జార్జ్ బెయిలీ స్పందించారు. "దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆకట్టుకున్నాడు. మెరుగైన ప్రదర్శనతో స్ట్రాంగ్ స్పిన్ ఆప్షన్‌గా మారాడు. ఈ పర్యటనలో నాథన్ లయన్, అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీ పర్యవేక్షణలో మరింతగా రాణిస్తాడని అనుకుంటున్నాను" అని జార్జ్ బెయిలీ తెలిపాడు.
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్ కంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్‌సన్, డేవిడ్ వార్నర్.
సంబంధిత కథనం