తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sarfaraz Khan Century: మరో సెంచరీ బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. సెలక్టర్లకు బ్యాట్‌తోనే సమాధానం

Sarfaraz Khan Century: మరో సెంచరీ బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. సెలక్టర్లకు బ్యాట్‌తోనే సమాధానం

Hari Prasad S HT Telugu

17 January 2023, 17:15 IST

    • Sarfaraz Khan Century: మరో సెంచరీ బాదాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ ముంబై బ్యాటర్‌ నేషనల్‌ సెలక్టర్లకు మరోసారి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యే ఆస్ట్రేలియా సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీపై సెంచరీ చేసిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్
ఢిల్లీపై సెంచరీ చేసిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ (PTI)

ఢిల్లీపై సెంచరీ చేసిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz Khan Century: రంజీ ట్రోఫీలో చెలరేగుతూనే ఉన్నాడు ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ సీజన్‌లో మూడో సెంచరీ చేశాడతడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ 125 రన్స్‌ చేయడం విశేషం. మిగతా బ్యాటర్లంతా తడబడినా కూడా సర్ఫరాజ్‌ మాత్రం తన టీమ్‌ను సెంచరీతో ఆదుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌తో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 రన్స్‌కు ఆలౌటైంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సర్ఫరాజ్‌ కాకుండా పృథ్వీ షా మాత్రమే 40 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై టీమ్‌కు సర్ఫరాజ్‌ తన విలువైన ఇన్నింగ్స్‌తో ఓ మోస్తరు స్కోరు సాధించి పెట్టాడు. పృథ్వీ షాతోపాటు షామ్స్‌ ములానీ (39), ప్రసాద్‌ పవార్‌ (25).. సర్ఫరాజ్‌కు సహకారం అందించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

గత మూడేళ్ల కాలంగా డొమెస్టిక్‌ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేస్తూ నేషనల్‌ సెలక్టర్ల పిలుపు కోసం సర్ఫరాజ్‌ ఎదురు చూస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నా కూడా అతన్ని నేషనల్‌ సెలక్టర్లు కరుణించలేదు. ఈ మధ్యే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమ్‌లోనూ సర్ఫరాజ్‌కు చోటు దక్కలేదు. అతని కంటే ముందు సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. సర్ఫరాజ్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టీమిండియాకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించేదే అయినా.. తాను ప్రయత్నం మాత్రం వదలనని స్పష్టం చేశాడు. 2019 నుంచి సర్ఫరాజ్ 22 ఇన్నింగ్స్‌లో 2289 రన్స్‌ చేశాడు. సగటు 134 కాగా.. అందులో 9 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు, రెండు డబుల్‌ సెంచరీలు, ఒక ట్రిపుల్‌ సెంచరీ ఉన్నాయి. ఈ స్థాయిలో రాణిస్తున్నా కూడా తనను ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని సర్ఫరాజ్‌ అంటున్నాడు.

"నేను ఎక్కడికి వెళ్లినా..త్వరలోనే ఇండియన్‌ టీమ్‌లోకి వస్తానని చెప్పుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు నన్ను తీసుకోకపోవడంపై మాట్లాడుకుంటున్నారు. నా టైమ్‌ వస్తుందని అందరూ అంటున్నారు. టీమ్‌ ఎంపిక రోజు అస్సాం నుంచి ఢిల్లీ వచ్చాను.

ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను ఎందుకు టీమ్‌లో లేను? అనే ప్రశ్న నన్ను వేధించింది. మా నాన్నతో మాట్లాడిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చాను. నేను ప్రాక్టీస్‌ మానను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లను. నేను ప్రయత్నిస్తూనే ఉంటా" అని సర్ఫరాజ్‌ చెప్పాడు.

తదుపరి వ్యాసం