తెలుగు న్యూస్  /  Sports  /  Sachin Tendulkar Tweet On Team India Rrr Ravindra Jadeja Ravinchandran Ashwin Rohit Sharma Gone Viral

Sachin Tendulkar on Team India RRR: టీమిండియా 'ఆర్ఆర్ఆర్'పై సచిన్ ప్రశంసల వర్షం.. వాళ్లెవరో తెలుసా?

Hari Prasad S HT Telugu

10 February 2023, 14:26 IST

    • Sachin Tendulkar on Team India RRR: టీమిండియా 'ఆర్ఆర్ఆర్'పై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆ ముగ్గురిపై మాస్టర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ
రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ (AP)

రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ

Sachin Tendulkar on Team India RRR: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నోట ఆర్ఆర్ఆర్ మాట వినిపించింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీ పేరును అతడు ఇండియన్ టీమ్ లోని ముగ్గురు ఆర్ఆర్ఆర్ ల కోసం ఉపయోగించాడు. ప్రస్తుతం ఆ ముగ్గురే ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో ఇండియాను టాప్ లో నిలబెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరో తెలుసా? రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ. ఈ ముగ్గురే నాగ్‌పూర్ లో అటు బంతితో, బ్యాట్ తో మెరిశారు. వీళ్లను ఉద్దేశించి సచిన్ ట్వీట్ చేశాడరు. "ఆర్ఆర్ఆర్.. రోహిత్, రవీంద్ర, రవిచంద్రన్ త్రయం టెస్టులో ఇండియాను ఆధిక్యంలో నిలబెట్టారు. రోహిత్ తన సెంచరీతో ముందుండి నడిపించగా.. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ముఖ్యమైన వికెట్లు తీశారు" అని సచిన్ ట్వీట్ చేయడం విశేషం.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఐదు నెలల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడేజా ఐదు వికెట్లు తీశాడు. ఇక అశ్విన్ మూడు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కేవలం 177 పరుగులుకే పరిమితమైంది.

ఇక ఇండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ ముందుండి నడిపించాడు. కఠినమైన పిచ్ పై సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా సెంచరీతో టీమ్ కు కీలకమైన ఆధిక్యం దక్కేలా చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ఏ బ్యాటర్ కనీసం హాఫ్ సెంచరీ చేయలేని పిచ్ పై హిట్ మ్యాన్ సెంచరీ చేయడం విశేషం.

ఈ సెంచరీతో మూడు ఫార్మాట్లలోనూ మూడంకెల స్కోరు అందుకున్న తొలి ఇండియన్ కెప్టెన్ అయ్యాడు. ఓవరాల్ గా ప్రపంచంలో నాలుగో కెప్టెన్ గా నిలిచాడు. ఈ ట్రిపుల్ ఆర్ చేసిన మ్యాజిక్ తో నాగ్‌పూర్ టెస్టులో ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది.