Rohit 9th test century: రోహిత్ శర్మ అరుదైన సెంచరీ ఘనత.. హిట్ మ్యాన్‌కు మాత్రమే సొంతమైన రికార్డు
Rohit 9th test century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
Rohit 9th test century: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ అదరగొట్టాడు. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేశాడు. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున హిట్ మ్యాన్ నిలకడైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. శతకంతో రాణించాడు. చివరగా రోహిత్ సెప్టెంబరు 2021లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌పై శతకం చేశాడు. ఈ ఘనతతో మూడు ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేసిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.
నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో బంతి అనూహ్యంగా మలుపు తిరుగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 77/1తో పటిష్ఠంగా ఉన్న భారత్.. కొద్ది వ్యవధిలో టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. పుజారా, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ హిట్ మ్యాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సొగసైన సెంచరీతో భారత్‌కు మంచి ఆధిపత్యం అందించే దిశగా తీసుకెళ్తున్నాడు. 171 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.
తిప్పేసిన మర్ఫీ..
రెండో రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ తిప్పేశాడు. తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం నాడు కేఎల్ రాహుల్ వికెట్ తీసిన అతడు.. శుక్రవారం ఉదయం రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, పుజారా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ టీమిండియా స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును భారత్ 177 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(49), స్టీవ్ స్మిత్(37) మినహా మిగిలినవారు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌లో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు.
సంబంధిత కథనం
టాపిక్