తెలుగు న్యూస్  /  Sports  /  Rohit On Rahul Vs Gill Says Removal From Vice Captaincy Indicates Nothing

Rohit on Rahul vs Gill: రాహుల్ వైస్ కెప్టెన్సీ కోల్పోయాడేమో కానీ.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

28 February 2023, 14:43 IST

    • Rohit on Rahul vs Gill: రాహుల్ వైస్ కెప్టెన్సీ కోల్పోయాడేమో కానీ అంటూ కెప్టెన్ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మూడో టెస్టులో రాహుల్, శుభ్‌మన్ గిల్ లలో ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారన్న విషయంపై రోహిత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (PTI)

కేఎల్ రాహుల్

Rohit on Rahul vs Gill: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇండియా ఇప్పటికే తిరుగులేని ఆధిక్యంలో ఉంది. అయితే బుధవారం (మార్చి 1) మూడో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చంతా తుది జట్టులో రాహుల్ ఉంటాడా లేక గిల్ కు అవకాశం ఇస్తారా అన్నదాని చుట్టూనే నడుస్తోంది. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రాహుల్ తుది జట్టులో స్థానం కోల్పోవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తీసేయడం ఎలాంటి సంకేతాలు ఇవ్వదని రోహిత్ స్పష్టం చేశాడు. "గత మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం చెప్పాను. ఎవరైనా ప్లేయర్స్ క్లిష్టమైన దశ ఎదుర్కొంటున్న సమయంలో, సామర్థ్యం ఉన్న వారికి తమను తాము నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాము.

వైస్ కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా అది ఎలాంటి సంకేతాలు ఇవ్వదు. అతడు వైస్ కెప్టెన్ గా ఉన్న సమయంలో అతడే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు" అని రోహిత్ చెప్పాడు.

అయితే రాహుల్ స్థానంలో టీమ్ లోకి వస్తాడని భావిస్తున్న శుభ్‌మన్ గిల్ నెట్స్ లో చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఆ లెక్కన గిల్ తుదిజట్టులోకి రావడం ఖాయం అనీ అంచనా వేస్తున్నారు. అయితే దీనిపైనా రోహిత్ నేరుగా సమాధానం ఇవ్వలేదు.

"గిల్, కేఎల్ విషయానికి వస్తే ఏ మ్యాచ్ ముందు అయినా వాళ్లిద్దరూ అలాగే ప్రాక్టీస్ చేస్తారు. ఇవాళ (మంగళవారం, ఫిబ్రవరి 28) టీమ్ మొత్తానికి ట్రైనింగ్ ఆప్షనల్. ఇందులో గిల్, రాహుల్ ప్రస్తావన అవసరం లేదు. ఇక తుది జట్టు విషయానికి వస్తే ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. టాస్ సమయంలోనే దీనిని ప్రకటిస్తాను. చివరి నిమిషంలో గాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని రోహిత్ అన్నాడు.

మంగళవారం ప్రాక్టీస్ ఆప్షనల్ అయినా కూడా రోహిత్ తోపాటు గిల్ కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. సోమవారంలాగే మంగళవారం కూడా గిల్ చాలాసేపు నెట్స్ లో గడిపాడు. రాహుల్ మాత్రం ప్రాక్టీస్ చేయలేదు.