తెలుగు న్యూస్  /  Sports  /  Prithvi Shaw Takes The Trophy From Hardik Pandya Looks Very Happy

Prithvi Shaw: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ట్రోఫీ అందుకున్నాడు.. పృథ్వీ ఫుల్ హ్యాపీ.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

02 February 2023, 11:46 IST

    • Prithvi Shaw: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ట్రోఫీ అందుకున్నాడు పృథ్వీ షా. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తాను అందుకున్న ట్రోఫీని పృథ్వీకి ఇవ్వగానే అతడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు.
కెప్టెన్ హార్దిక్ నుంచి ట్రోఫీ అందుకుంటున్న పృథ్వీ షా
కెప్టెన్ హార్దిక్ నుంచి ట్రోఫీ అందుకుంటున్న పృథ్వీ షా

కెప్టెన్ హార్దిక్ నుంచి ట్రోఫీ అందుకుంటున్న పృథ్వీ షా

Prithvi Shaw: టీమిండియా ఏ ట్రోఫీ గెలిచినా అది టీమ్ లోని ఓ యువ ఆటగాడికి ఇవ్వడం అనే సాంప్రదాయాన్ని మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్లు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఇండియన్ టీమ్ స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ ట్రోఫీని పృథ్వీ షాకు అందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ సిరీస్ కు అతడు ఎంపికైనా కూడా ఒక్క మ్యాచ్ లోనూ పృథ్వీకి ఆడే అవకాశం రాలేదు. కానీ కెప్టెన్ హార్దిక్ నేరుగా వచ్చి తనకు ట్రోఫీ ఇవ్వడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఆ ట్రోఫీతో ఆనందంగా గెంతులేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు ఇలాంటి ట్రోఫీలు అందుకుంటే అది వాళ్లలో ఎంతో స్ఫూర్తి నింపుతుందని ధోనీ నమ్మేవాడు.

ఇప్పుడు టీ20ల్లో హార్దిక్ కూడా అదే కొనసాగిస్తున్నాడు. అంతేకాదు టీమ్ విజయాల క్రెడిట్ ను ప్లేయర్స్ కు ఇచ్చి, పరాజయాల బాధ్యతను తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి స్ఫూర్తిదాయక కెప్టెన్సీ వల్లే హార్దిక్ సారథ్యంలో ఇండియా ఇప్పటి వరకూ ఆడిన ప్రతి టీ20 సిరీస్ గెలిచింది. ముఖ్యంగా న్యూజిలాండ్ పై 0-1తో వెనుకబడిన తర్వాత కూడా పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవడం మామూలు విషయం కాదు.

జట్టులోని యువ ఆటగాళ్లు నిరుత్సాహ పడకుండా హార్దిక్ వాళ్లను ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాట్ తో సంయమనంతో ఆడుతున్నాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా పృథ్వీ షా నీరుగారకుండా ఉండేందుకు ట్రోఫీని తీసుకెళ్లి అతని చేతుల్లో పెట్టాడు. దీంతో టీమ్ లో అందరి కంటే ఉత్సాహంగా అతడు కనిపించాడు.

నిజానికి పృథ్వీకి అవకాశం ఇవ్వకుండా ఇషాన్, శుభ్‌మన్ గిల్ లనే కొనసాగించడంపై హార్దిక్ ను చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా వన్డేల్లో రాణిస్తున్న గిల్ టీ20లకు పనికి రాడని కూడా కొందరు మాజీ క్రికెటర్లు అన్నారు. అయినా వాళ్లపైనే హార్దిక్ నమ్మకముంచాడు. దీని ఫలితం చివరి టీ20లో చూశాం. శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయి టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు.