Hardik Pandya on Dhoni: ధోనీ రిటైరయ్యాక ఆ బాధ్యత నేను తీసుకున్నాను: హార్దిక్ పాండ్యా-hardik pandya on dhoni says ever since he is gone he took the responsibility of him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya On Dhoni Says Ever Since He Is Gone He Took The Responsibility Of Him

Hardik Pandya on Dhoni: ధోనీ రిటైరయ్యాక ఆ బాధ్యత నేను తీసుకున్నాను: హార్దిక్ పాండ్యా

Hari Prasad S HT Telugu
Feb 02, 2023 10:08 AM IST

Hardik Pandya on Dhoni: ధోనీ రిటైరయ్యాక ఆ బాధ్యత నేను తీసుకున్నానంటూ టీమిండియా స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పై సిరీస్ విజయం తర్వాత హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హార్దిక్ పాండ్యా, ధోనీ
హార్దిక్ పాండ్యా, ధోనీ (BCCI/File)

Hardik Pandya on Dhoni: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇండియా మరో టీ20 సిరీస్ విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్ గా తనకు వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకుంటున్నాడు. కివీస్ పై మూడో టీ20లో ఏకంగా 168 పరుగులతో రికార్డు విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంలో హార్దిక్ అంటు బ్యాట్ తో, ఇటు బాల్ తో కీలకపాత్ర పోషించాడు.

ట్రెండింగ్ వార్తలు

మొదట బ్యాటింగ్ లో కేవలం 17 బాల్స్ లోనే 30 రన్స్ చేసిన అతడు.. తర్వాత బాల్ తో 16 పరుగులకే 4 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత మాజీ కెప్టెన్ ధోనీ గురించి పాండ్యా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ధోనీ రిటైరైన తర్వాత అతని బాధ్యతను తాను తీసుకున్నట్లు హార్దిక్ చెప్పడం విశేషం.

"నేను సిక్స్ లు కొట్టడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేశాను. కానీ జీవితమంటే అదే. ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. నేను భాగస్వామ్యాలను నమ్ముతున్నాను. నేను క్రీజులో ఉన్నానన్న నమ్మకాన్ని నా బ్యాటింగ్ పార్ట్‌నర్‌కు, నా టీమ్ కు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

టీమ్ లో ఉన్న అందరి కంటే నేను ఎక్కువ మ్యాచ్ లు ఆడాను. ఒత్తిడిని ఎలా అధిగమించాలి.. బయటకు ప్రశాంతంగా ఎలా కనిపించాలో నాకు తెలుసు. దాని కోసమే నా స్ట్రైక్ రేట్ ను తగ్గించుకున్నా. కొత్త రోల్స్ ను తీసుకోవడానికే నేను ఎప్పుడూ ఇష్టపడుతుంటాను.

అందుకే నేను కొత్త బంతితోనూ బౌలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఆ క్లిష్టమైన రోల్ తీసుకోవాలని నేను అనుకోను. నేను ముందుండి నడిపించాలని అనుకుంటాను. కొత్త బంతితో బౌలింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని పాండ్యా చెప్పాడు.

ఈ సందర్భంగానే ధోనీ ప్రస్తావన తీసుకొచ్చాడు. "ఆ రోల్ ను తీసుకోవడానికి నేను వెనుకాడను. మహి ఈ పాత్రను పోషించేవాడు. ఆ సమయంలో నేను యువకుడిగా ఉన్నాను. గ్రౌండ్ నలుమూలలా సిక్స్ లు బాదేవాడిని. కానీ అతడు వెళ్లిన తర్వాత ఆ బాధ్యత నేను తీసుకున్నాను. కానీ దానిని నేను పెద్దగా పట్టించుకోను. ఫలితాలు వస్తున్నాయి. నెమ్మదిగా ఆడటం వల్ల నష్టమేమీ లేదు" అని హార్దిక్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం