తెలుగు న్యూస్  /  Sports  /  Irfan Pathan On Hardik Pandya It Is Extremely Difficult To Find The The Players Like Him

Irfan Pathan on Hardik Pandya: హార్దిక్ పాండ్యాలాంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ చాలా అరుదు: ఇర్ఫాన్

Hari Prasad S HT Telugu

26 January 2023, 10:31 IST

    • Irfan Pathan on Hardik Pandya: హార్దిక్ పాండ్యాలాంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ చాలా అరుదని అన్నాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడు ఫామ్ లో ఉంటే ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ పాండ్యాపై ఇర్ఫాన్ ప్రశంసలు
హార్దిక్ పాండ్యాపై ఇర్ఫాన్ ప్రశంసలు (ANI-PTI)

హార్దిక్ పాండ్యాపై ఇర్ఫాన్ ప్రశంసలు

Irfan Pathan on Hardik Pandya: టీమిండియా కొత్త ఏడాదిలో వరుసగా రెండో వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలుసు కదా. మొదట శ్రీలంకపై, తర్వాత న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ విజయాల్లో గిల్, కోహ్లి, రోహిత్, సిరాజ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్ర పోషించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే న్యూజిలాండ్ తో మూడో వన్డేలో టీమ్ కు చివర్లో భారీ స్కోరు సాధించి పెట్టిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మిడిలార్డర్ వైఫల్యంతో గిల్, రోహిత్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని మధ్యలో టీమిండియాలో ఉపయోగించుకోలేకపోయింది. అయితే చివర్లో హార్దిక్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో కివీస్ ముందు 386 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఆ తర్వాత బౌలింగ్ లోనూ పాండ్యా కీలకమైన ఫిన్ అలెన్ వికెట్ తీసుకున్నాడు. "అతడు చాలా కీలకమైన ఆటగాడు. టీమ్ లో బ్యాలెన్స్ కోసం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేసే ప్లేయర్ కావాలి. ఇండియన్ టీమ్ కు హార్దిక్ పాండ్యాలాంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్ ను సంపాదించడం చాలా కష్టం.

ప్రపంచ క్రికెట్ లోనూ పాండ్యాలాంటి ప్లేయర్స్ చాలా అరుదు. ముందు తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. అతడు ఆడిన షాట్లు చూస్తుంటే క్రికెట్ గ్రౌండ్ లో టెన్నిస్ ఆడినట్లుగా అనిపించింది. నేరుగా బౌలర్ తల మీదుగా కొట్టి పుల్ షాట్ అయితే అద్భుతం. ఇతర షాట్లు కూడా అతనిలోని పవర్, రేంజ్ ఏంటో చూపించాయి" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఇర్ఫాన్ అన్నాడు.

మూడో వన్డేలో పాండ్యా 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అందులో మూడు సిక్స్ లు, మూడు ఫోర్లు ఉన్నాయి. "పాండ్యా ఫామ్ లో ఉన్నప్పుడు అతన్ని ఆపడం చాలా కష్టం. అతని ఇన్నింగ్స్ సరైన సమయంలో వచ్చింది. ఎందుకంటే పాత బంతితో పరుగులు చేయడానికి ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కానీ పాండ్యా మాత్రం పెద్దగా కష్టపడకుండానే పరుగులు సాధించాడు" అని ఇర్ఫాన్ చెప్పాడు.

న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ కు ఇప్పుడు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. రోహిత్ లేకపోవడంతో టీ20ల్లో పాండ్యానే కెప్టెన్సీ చేపట్టనున్నాడు. గతేడాది న్యూజిలాండ్ లో ఇండియాకు సిరీస్ సాధించి పెట్టిన హార్దిక్.. ఈసారి స్వదేశంలో ఏంచేస్తాడో చూడాలి.