తెలుగు న్యూస్  /  Sports  /  Rahane Six Makes Gavaskar Rub His Eyes

Rahane Six: రహానే కొట్టిన భారీ సిక్స్ చూసి నోరెళ్లబెట్టిన గవాస్కర్

Hari Prasad S HT Telugu

17 April 2023, 21:03 IST

  • Rahane Six: రహానే కొట్టిన భారీ సిక్స్ చూసి నోరెళ్లబెట్టాడు సునీల్ గవాస్కర్. ఈ సీజన్ ఐపీఎల్లో తన విశ్వరూపం చూపిస్తున్న రహానే సోమవారం (ఏప్రిల్ 17) ఆర్సీబీతో మ్యాచ్ లోనూ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఫాఫ్ డుప్లెస్సి, అజింక్య రహానే
ఫాఫ్ డుప్లెస్సి, అజింక్య రహానే (IPL)

ఫాఫ్ డుప్లెస్సి, అజింక్య రహానే

Rahane Six: ఈ ఏడాది ఐపీఎల్లో ఓ కొత్త రహానేను చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఈ టీమిండియా సీనియర్ బ్యాటర్ గతేడాది టెస్టు టీమ్ లోనూ చోటు కోల్పోయిన తర్వాత ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్ పై ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు కేవలం 27 బాల్స్ లోనే 61 రన్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇక తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ లోనూ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బాల్స్ లో 37 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో రహానే కొట్టిన ఓ సిక్స్ గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్ ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్సీబీ బౌలర్ విజయ్ కుమార్ వైశాక్ బౌలింగ్ లో రహానే లెగ్ సైడ్ లో ఓ భారీ సిక్స్ కొట్టాడు. అది కాస్త స్టేడియం రూఫ్ కి తగిలి మళ్లీ గ్రౌండ్ లోకి రావడం విశేషం.

ఈ సిక్స్ చూసి మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ షాక్ తిన్నారు. నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను అని గవాస్కర్ అన్నాడు. రహానే అద్భుతమైన వెర్షన్ ఇది అని సన్నీ అన్నాడు. ఈ షాట్ ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అదే ఊపులో పార్నెల్ వేసిన తర్వాతి ఓవర్లో రహానే మరో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడం విశేషం. చివరికి 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో 37 రన్స్ చేసి ఔటయ్యాడు.

గతేడాది ఐపీఎల్లోనూ విఫలమైన రహానే.. ఈసారి సీఎస్కే తరఫున వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. మెరుపు వేగంతో స్కోరు చేస్తూ.. సీఎస్కే టీమ్ లో ప్రధాన బ్యాటర్ గా మారిపోయాడు. మూడు మ్యాచ్ లలోనూ అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైపై 27 బాల్స్ లో 61, తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో 19 బంతుల్లో 31, ఆర్సీబీతో 20 బంతుల్లో 37 రన్స్ చేశాడు.